Tuesday, January 21, 2025

తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక : కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక గా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని సిఎం కెసిఆర్ అన్నారు. సర్వాయి పాపన్న జయంతి (జూలై 18) సందర్భంగా వారి కృషిని, పోషించిన చారిత్రక పాత్రను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు.

విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి. వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించామని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేస్తు న్నామని సిఎం కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News