Thursday, January 23, 2025

హైదరాబాద్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. గత నెల 25వ తేదీన రాత్రి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఐదు రోజుల పాటు జరిగిన పర్యటనలో భాగంగా సిఎం వివిధ పార్టీల రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారితో కెసిఆర్ సుధీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పాల ఉత్పత్తులపై జిఎస్‌టి పెంపు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారని సమాచారం. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు, ఆర్ధిక అంశాలు, రుణాల కోసం కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అనుమతులపై పార్టీ ఎంపిలకు కెసిఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. వీటిపై పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలు, ఆందోళనలు, నిరసనలపై తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. కెసిఆర్ జారీ చేసిన ఆదేశాలతో టిఆర్‌ఎస్ ఎంపీలు కూడా ఉభయ సభల్లో వివిధ అంశాలపై గట్టిగా చర్చకు పట్టుబట్టారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకవచ్చారు. కేంద్రంపై తీరును ఎండగట్టడంలో వారు పార్లమెంట్ లోపలు, వెలుపల సఫలీకృతులయ్యారు.
అదే సమయంలో బిజెపియేతర ప్రభుత్వాల పట్ల మోడీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన ఆందోళన, నిరసన కార్యక్రమాలపై పలువురు నేతలతో కెసిఆర్ చర్చించారని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ అగమేఘాలపై ఢిల్లీకి వచ్చి కెసిఆర్‌తో జాతీయ రాజకీయాలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు.

కేంద్ర వ్యతిరేక విధానాలపై చేయాల్సిన పోరాటం వారిద్దరు చర్చించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్న మోడీ ప్రభుత్వంపైసమష్టిగా పోరాడేందుకు కలిసి రావాలని అఖిలేశ్‌ను ఈ సందర్భంగా కెసిఆర్ కోరినట్లు సమాచారం. దేశంలో ప్రాంతీయ పార్టీలు, సదరు ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిలేశ్‌యాదవ్‌తో కెసిఆర్ ప్రస్తావించినట్లుగా సమాచారం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని వారిద్దరు నిర్ణయించినట్లు తెలిసింది. కాగా సిఎం వెంట ఢిల్లీ వెళ్లిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోశ్‌కుమార్, రంజిత్‌రెడ్డి, ఎల్‌బినగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌డ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఉన్నారు.

CM KCR Returns to Hyderabad from Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News