హైదరాబాద్: తెలంగాణలో త్వరలోనే దళితబంధు నిధులు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. శనివారం మఖ్యమంత్రి సిఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో దళితబంధు అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దళిత కుటుంబాలు తలెత్తుకునేలా ఉండాలని, ఆర్థికంగా ఎదగాలన్నారు. దళితబంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజూరాబాద్ తోపాటు నాలుగు మండల పరిధిలో ప్రకటించిన విధంగానే దళితబంధు అమలు చేస్తామన్నారు. దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని సిఎం చెప్పారు. తాము ఎప్పుడూ మోసగించబడుతామనే దుఃఖం దళిత వాడల్లో వుందని, వారి ఆర్తిని అర్థం చేసుకుని పనిచేయాల్సిన అవసరం వుందని.. మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలో లేని తృప్తి దళిత బంధు పథకం అమలులో పాల్గొనడం ద్వారా దొరుకుతుందని కలెక్టర్లను ఉద్దేశించి సిఎం అన్నారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను, వ్యాపార, ఉపాధి మార్గాలను శోధించాలని, అందుకు దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ధి కాముకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.
CM KCR Review meeting on Dalitha Bandhu