Friday, November 22, 2024

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో శనివారం జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశ‌మై ఉద్యోగుల విభజనతోపాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు. ఈ జోనల్ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని, క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పనిచేస్తేనే సమాగ్రాభివృద్ధి జరుగుతుందని, భార్యభర్తలు ఒకేచోట ఉంటేనే ప్రశాంతంగా పనిచేయగలరన్నారు. నాలుగు, ఐదు రోజుల్లో ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM KCR Review meeting on New Zonal System

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News