- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షిస్తున్నారు. ప్రగతిభవన్ లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో చర్చిస్తున్నారు. కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పై ఆరా తీస్తున్నారు. ఈ సమావేశానికి సిఎస్ సోమేశ్ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఇ రమేశ్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగున్నాయి. ఒక్కరోజులో 6,026 మంది కరోనా బారిన పడినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24గంటల్లో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 6,551 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు.
CM KCR Review on Corona Conditions in Telangana
- Advertisement -