Wednesday, November 6, 2024

దళిత స్వావలంబన

- Advertisement -
- Advertisement -

Telangana Cabinet meeting continue

స్వీయ చైతన్యంతోనే సాధికారత

దళితబంధు అమలు తీరుపై లోతైన అధ్యయనం

ఎస్‌సిల స్థితిగతులపై హుజూరాబాద్‌లో అధికారుల పర్యటనలు 
పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో దళితుల స్థితిగతులపై అవగాహన 
ఉద్యోగులు, దళిత సంఘాలతో త్వరలో వర్క్‌షాప్ 
సూచనలు, సలహాలతో వినూత్న పథకాలకు రూపకల్పన, లబ్ధిదారులకే ఎంచుకునే అవకాశం 
ఉత్పత్తిలో భాగస్వాములైతేనే దళిత సాధికారతకు నిజమైన అర్థం 
33 జిల్లాల అధికారుల భాగస్వామ్యం, అవగాహన దళితబంధు విధి విధానాలు, రూపకల్పనపై ప్రగతిభవన్ సమీక్షలో సిఎం కెసిఆర్

ఒక దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా ఎటువంటి ఉపాధిని, పనిని అప్పచెప్పితే వారు సులువుగా చేసుకోగలుగుతరు అనేది ముందు గుర్తించాలి. వారి ఓరియెంటేషన్ ఏందనేది తెలుసుకోవాలి. పాల ఉత్పత్తి కోసం బర్రెల పెంపకం, కిరాణం షాపు, ఆటోరిక్షాల నిర్వహణ, కుటీర పరిశ్రమలు తదితర ఉపాధి అవకాశాలను గుర్తించాలి. వాటిని మార్కెట్‌కు అనుసంధానం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలి. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఇంటి పెద్దగా మహిళ ఉంటే, ఆ కుటుంబానికి అనువుగా ఎటువంటి పథకం అందించాలి, ఒక ఇంట్లో పెద్దకొడుకు ఇంటి పెద్దగా ఉండి తల్లి తమ్ములు చెల్లెలు ఉంటే ఆ యువకున్ని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి స్కీం ను తయారు చేయాలి? ఒక ఇంట్లో చదువుకునే అవకాశం రాని యువతీ యువకులుంటే వారికి ఎటువంటి స్కీంను
అందించాలనే విషయాలపై లోతుగా అధ్యయనం చేయాలి.

మన తెలంగాణ/హైదరాబాద్: తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అనతి కాలంలో ఆర్థిక స్వావలంబన కలిగించే వి నూత్న ఉపాధి స్కీంలను ‘తెలంగాణ దళిత బంధు’ పథకం లో భాగంగా రూపకల్పన చేసి లబ్ధిదారుల ముందుంచాలని సిఎం తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. ముందు అధికారులు సెన్సిటైజ్ కావాలన్నారు. ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులను పథకం ఉపయోగించుకోవడంలో ఉద్ధీపన (సెన్సిటైజ్) కలిగించాలని అధికారులకు సూచించారు. దళితుల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న తెలంగాణ దళిత బంధు పథకం అమలు విధి విధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై సోమవారం సిఎం కెసిఆర్ ప్రగతిభవన్‌లో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్ నియోజకవర్గ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి దళిత కుటుంబాల స్థితి గతులను అర్థం చేసుకోవాలన్నారు. అదే సమయంలో వారి అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పలు రకాల పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలన్నారు. ముందు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగా సెన్సిటైజ్ కావాలని సిఎం పేర్కొన్నారు.
ముందే అవగాహన పెంచుకోవాలి
పైలెట్ ప్రాజెక్టు కేంద్రంగా ఉండే ప్రాంతంపై ముందే అధికారులు అవగాహన పెంచుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఉపాధి కల్పించే పలు వినూత్న పథకాల రూప కల్పనకోసం క్షేత్రస్థాయి పర్యటనలను ఎలా చేపట్టాలి? ఈ సందర్భంగా ఎవరెవరిని కలవాలి? వారి నుంచి సమాచారం ఏ విధంగా తీసుకోవాలి? దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనుభవజ్జుల సలహాలను పాటిం చి వారి సూచనలను పథకంలో భాగంగా ఎట్లా అమలు పరచాలి? అనే అంశాల మీద ముందుగా అధికారులు తెలుసుకోవాలని సిఎం సూచించారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు ఉద్యోగులు దళిత ప్రముఖులు, దళిత సంఘాల నేతలు యాక్టివిస్టులతో కూడిన వర్క్ షాపు త్వరలో నిర్వహించనున్నట్టు సిఎం తెలిపారు. వర్కుషాప్ లో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి పైలట్ ప్రాజెక్టు చేపడుతున్న నియోజకవర్గంలోని దళిత వాడలకు వెల్లాలని, అక్కడ దళిత కుటుంబాలతో మాట్లాడాలని, దళిత సమస్యల పై అవగాహన వున్న దళిత ప్రముఖులను కలవాలని వారి సలహాలు సూచనలతో స్కీంలను రూపొందించాలని సిఎం తెలిపారు. దళితుల అవసరాలు ఎట్లున్నయి ? అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించగానే ఎక్కువ కాలం గ్యాప్ లేకుండా ఆదాయం సృష్టించుకునే విధంగా ఉందా లేదా గుర్తించి పథకం రూపకల్పన చేయాలన్నారు.
స్కీంలపై లోతుగా అధ్యయనం జరగాలి
ఒక దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా ఎటువంటి ఉపాధిని, పనిని అప్పచెప్పితే వారు సులువుగా చేసుకోగలుగుతరు అనేది ముందు గుర్తించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. వారి ఓరియెంటేషన్ ఏందనేది తెలుసుకోవాలన్నారు. పాల ఉత్పత్తి కోసం బర్రెల పెంపకం, కిరాణం షాపు, ఆటోరిక్షాల నిర్వహణ, కుటీర పరిశ్రమలు తదితర ఉపాధి అవకాశాలను గుర్తించాలన్నారు. వాటిని మార్కెట్ అనుసంధానం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం సహ కరించాలన్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఇంటి పెద్దగా మహిళ ఉంటే, ఆ కుటుంబానికి అనువుగా ఎటువంటి పథకం అందిచాలి., ఒక ఇంట్లో పెద్దకొడుకు ఇంటి పెద్దగా వుండి తల్లి తమ్ములు చెల్లెలు ఉంటే ఆ యువకున్ని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి స్కీం ను తయారు చేయాలి? ఒక ఇంట్లో చదువుకుని అవకాశం రాని యువతీ యువకులుంటే వారికి ఎటువంటి స్కీంను అందించాలనే విషయాలపై లోతుగా అధ్యయనం చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. అందుకోసం అవసరమైతే మన దగ్గరున్న ఉపాధి పథకాలేంటివి అనేది వారికి ఉదాహరణలతో సహా వివరించాలి. మనం తయారు చేసిన స్కీంల లిస్టును వారి ముందుంచాలన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో అమలు పరుస్తున్న ఇతర ఉపాధి మార్గాలేమన్నా ఉన్నాయా ? అనేది విచారించాలని సూచించారు. వారికి ఇష్టమై తీసుకుంటే మంచిది లేకుంటే వారికిష్టమైన పని ఏమన్నా ఉందా? అని అడిగి తెలుసుకోవాలన్నారు. వారు చెప్పిన పనిలో ఆర్థిక స్వావలంబన కలిగించి వారిని అభివృద్ధి పథాన నడిపిస్తదని అనిపిస్తే అధికారులు లబ్ధిదారులు కోరుకున్న స్కీంనే ఫైనల్ చేయాలన్నారు. ఈ దిశగా పైలట్ ప్రాజెక్టులో అవగాహన పెంచుకోవాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
ఉపాధి పథకం ఇష్టమైనదిగా ఉండాలే
దళిత బంధు కింద అర్హులైన లబ్ధిదారులకు అందించే ఉపాధి స్కీం వారికి ఇష్టమైనదై ఉండాలని సిఎం కెసిఆర్ అన్నారు. వారి జీవితాలను అనతికాలంలో అభివృద్ధి చేసేదై ఉండాలే కాని పథకం కోసం పథకంగా మూస పద్దతిలో వాల్లకు అంటగట్టినట్టుగా ఉండకూడదని సిఎం అధికారులకు వివరించారు. గ్రామ మండల మున్సిపాలిటీ లెవల్లో దళితుల సమస్యలను విడి విడిగా గుర్తించి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలోని 33 జిల్లాలకు చెందిన అధికారులను భాగస్వాములను చేసి వారికి అవగాహనపెంచాలన్నారు. హుజూరాబాద్ లో క్షేత్రస్థాయి అనుభవాలను అర్థంచేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సిఎం తెలిపారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఎస్‌సి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్‌సి డెవలప్ కార్పోరేషన్ ఎండి పి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

CM KCR Review on Dalita Bandhu Scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News