Sunday, December 22, 2024

వరదలపై సిఎం కెసిఆర్ నిరంతరం సమీక్ష….

- Advertisement -
- Advertisement -

జిల్లా మంత్రులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్న సిఎం
ఎన్టీఆర్‌ఎప్ బృందాలు, హెలికాప్టర్లు ద్వారా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
వరద ముంపు ప్రాంతాల అధికారులు అలర్ట్‌గా ఉండాలి ఆదేశాలు
జల దిగ్భందంలో ఉన్న మోరంచపల్లి ప్రజలను కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు, పడవలు వినియోగం
ఖమ్మంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురుని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
ప్రగతిభవన్ నుంచి క్షణక్షణం వరద పరిస్థితులపై సిఎం కెసిఆర్ ఆరా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బీకరంగా వర్షం పడుతుంటే సిఎం కెసిఆర్ గురువారం ఉదయం నుంచి క్షణక్షణం సమీక్షిస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భారీ వరదలపై ప్రగతిభవన్ నుంచి సిఎం సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో పరిస్థితిని సీఎస్ శాంతికుమారి ఎప్పటికప్పుడు సిఎంకు వివరిస్తున్నారు. ప్రధానంగా భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి మునిగి 1500 మంది ప్రజల ఆర్తనాదాలు చేయడంతో రెండు హెలికాప్టర్ల, పడవల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సిఎస్ సంప్రదింపులు జరిపారు.

Also Read: రూ. 1.5 కోట్ల ల్యాండ్ రోవర్‌లో బాబా రాందేవ్ షికార్లు(వైరల్ వీడియో)

సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ వినియోగించడం కష్టమైతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. సైన్ంయ అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను మోరంచపల్లికి పంపించారు. జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్‌తో మాట్లాడి వరద పరిస్థితులపై సమీక్షించాలని ఆదేశించారు. అదే విధంగా ఖమ్మం పట్టణానికి ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని, బూరుగుంపాడుకు హెలీకాప్టర్‌ను పంపించాలని సిఎం ఆదేశించడంతో పాటు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ను కూడా వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మున్నేరు నది 30 అడుగుల ప్రమాదకర స్దాయిలో ప్రవహిస్తోంది.

దీంతో లోతట్టు ప్రాంతాల కాలనీ జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. వెంటనే మంత్రి పద్మావతినగర్ వరదలో చిక్కుకున్న ఏడుగురి కుటుంబ సభ్యులను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. నిర్మల్ జిల్లాలో నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఎస్సారెప్సీ, కడెం, గడ్డెన్న , స్వర్ణ ప్రాజెక్టులోకి భారీ వరద నీరు చేరుతుండటంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చేపట్టాలని సిఎం పేర్కొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లు 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, మరో నాలుగు హెలికాప్టర్లు సిద్దంగా ఉంచాలని ముఖ్యమంత్రిని కోరడంతో ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అత్యవసరమైతే బయటకు రావాలని రోడ్డ భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను, క్షేత్రస్దాయిలో పరిశీలించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఎలాంటి ఆపద వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.

వదర బాధితులను ఆదుకోవాలని సిఎం కెసిఆర్ సూచించడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పలు నీటి మునిగిన ప్రాంతాలకు వెళ్లి ప్రభుత్వం ఆదుకుంటుందని, జిల్లా ప్రజలు ఎవరి భయపడవద్దని భరోసా కల్పించారు. జిల్లాలోని పోచంపల్లిలో వరదలో కొట్టుకుపోయి చనిపోయిన పిండి యాకయ్య, పిండి శ్రీనివాస్ కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ. 25వేల ఆర్దిక సహాయం ఇప్పిస్తానని భరోసా కల్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల పరిస్థితులపై సంబంధిత అధికారులతో మాట్లాడుతూ నీటి మునిగిన ప్రాంతాలను గుర్తించి ముఖ్యమంత్రికి సమాచారం అందించారు.
గ్రేటర్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగర పరిస్థితిపై మంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ, మూడు జిల్లాల అదనపు కలెక్టర్లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. పలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలని సిఎం కెసిఆర్ ఆదేశించడంతో మంత్రి కెటిఆర్ హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలని అ ధికారులకు సూచించారు. అనంతరం ముసారాంబాగ్ వంతెన వద్దకు వెళ్లి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News