- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖపై సిఎం కెసిఆర్ ఆదివారం సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, ఔషధాలు, వ్యాక్సినేషన్ పై చర్చ జరుపుతున్నారు. ఈ భేటీకి సిఎస్ సోమేష్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం వైద్య, ఆరోగ్యశాఖతో సమావేశమైన సిఎం తెలంగాణలో లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, ప్రజాజీవనం కుప్పకూలుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన పాజిటివ్ కేసులు తగ్గడం లేదని చెప్పారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్ తదితర అంశాలపై ప్రధానితో ఫోన్ లో మాట్లాడనని తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధికంగా కేటాయింపులు చేయాలని సిఎం కోరారు.
- Advertisement -