ప్రజలను, అధికార యంత్రాంగాన్ని
అప్రమత్తం చేసిన సిఎం కెసిఆర్
రక్షణ చర్యలు చేపట్టాలని సిఎస్‌కు
ఆదేశం అత్యవసరమైతే తప్ప
బయటకు రావొద్దని ప్రజలకు
హెచ్చరిక వరద బాధితులకు
అందుబాటులో ఉండాలని
మంత్రులు, నేతలకు సూచన
నేడో, రేపో వీడియో కాన్ఫరెన్స్
నిర్వహిస్తానని వెల్లడి నదులు
ఉప్పొంగుతున్నందున ఇరిగేషన్
శాఖ అలర్ట్‌గా ఉండాలని ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ వర ద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్‌డిఆర్‌ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేయాలని సిఎం సూచించారు. పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో పరిస్థితుల ను ఎప్పటికప్పుడూ తాను సమీక్షిస్తూంటానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి నేడో, రేపో వీడియో కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తానని సిఎం కెసిఆర్ తెలిపారు. జిల్లాలల్లో మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు.
రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ, నష్టాలను జరగకుండా చూసుకోవలని ప్రజా ప్రతినిధులకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. కాగా, భారీ వానలు వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని సిఎం కెసిఆర్ సూ చించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెల్లకుండా ఉండాలన్నారు. తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సిఎం విజ్ఞప్తి చేశారు. గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.