Thursday, December 19, 2024

రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటాం

- Advertisement -
- Advertisement -

CM KCR Review on Paddy Procurement

హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలన్నారు. బుధవారం ప్రగతి భవన్ లో వరిధాన్యం సేకరణపై సిఎం కేసిఆర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణ, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించామని అధికారులు సిఎంకు తెలిపారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, తడిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చైన రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని సిఎం స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్ ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సిఎం మరోసారీ స్పష్టం చేశారు.

CM KCR Review on Paddy Procurement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News