- Advertisement -
హైదరాబాద్: కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, డిజిపి, సిపిలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, లాక్ డౌన్, వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. సరిపడా డోసులు లేకపోవడంతో తెలంగాణలో పదిరోజులుగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. అయితే, ఒకటి రెండ్రోజుల్లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. మెదటగా ఫ్రంట్ లైన్ వారియర్ల జాబితాలో ఉన్న మీడియా, గ్యాస్ బాయ్స్, కూరగాయాల, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
CM KCR Review on Vaccination at Pragathi Bhavan
- Advertisement -