Monday, January 20, 2025

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు.. హెలికాప్టర్లు తరలించాలని సిఎం ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో కుండపోత వర్షలతో కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో 62 సెం.మీ, 47 సెం.మీల వర్షపాతాలు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది. దీంతో మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

దీంతో సికింద్రబాద్ కంటోన్మెంట్ మిలట్రీ అధికారులతో సిఎస్ శాంతా కుమారి సంప్రదింపులు జరుపుతున్నారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవడం కష్టం అవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే మోరంచపల్లికి  నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (న్డీఆర్ఎఫ్ బృందాలు) తరలించారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సిఎస్ సంప్రదిస్తూ పరిస్థితిని సీఎం కేసీఆర్ కు సమాచారం అందిస్తున్నారు. ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News