- Advertisement -
హైదరాబాద్: పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వం గుణాలను పెంచుతుందన్నారు. తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌కు రంజాన్ పర్వదినం ఓ ప్రతీక అని కొనియాడారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మక ఫలితాలిస్తున్నాయన్నారు.
- Advertisement -