Monday, December 23, 2024

స్వర్ణయుగానికి బాటలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల స్వల్పకాలంలోనే వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా దూసుకపోతున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అ నుసరిస్తున్న వినూత్న విధానాలు ప్రధాన కారణమన్నారు. ఇది దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాట లు వేసిందని తెలిపారు. జాతీయ రైతు దినోత్సవాన్ని (కిసాన్ దివస్ ) పురస్కరించుకొని ఆయన రాష్ట్ర, దేశ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, నాడు ఉ మ్మడి రాష్ట్రంలోని పరిస్థితులకు నేటి స్వరాష్ట్రంలోని రైతు సంక్షేమం, వ్యవసాయం ప రిస్థితులకు హస్తిమశకాంతరం ఉన్నదన్నా రు. వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవితాలను గుణాత్మక దిశ గా అభివృద్ధి పరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అత్యద్భుతమైన ఫలితాలనిస్తున్నాయన్నారు.

మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ తర్వాత అనేంతగా, దేశ వ్యవసాయరంగ నమూనా మార్పుకు… రాష్ట్ర వ్యవసాయ రంగాభివృద్ధి బాటలు వేసిందని కెసిఆర్ తెలిపారు. దండుగలా మారిన తెలంగాణ వ్యవసాయ రం గాన్ని నేడు పండుగలా మార్చామన్నారు. నేడు దేశానికే అన్నపూర్ణగా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించడం వెనుక ఎంతో శ్రమ, మేధోమథనం దాగి ఉన్నదని సిఎం తెలిపారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు అడుగడుగునా అడ్డుపుల్ల వే స్తూ, కేంద్రం తన రాజ్యాంగబద్దమైన బాధ్యతను విస్మరించిందన్నారు. కేంద్రం తెలంగాణకు ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా, వాటిని లెక్కచేయకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. పట్టుదలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని కెసిఆర్ తెలిపారు. రైతుబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
స్పిన్ ఆఫ్ ఎకానమిక్‌కు దారితీస్తేనే సుస్థిరాభివృద్ధి
వ్యవసాయరంగంలో సాధించే ప్రగతి సమస్త రంగాలకు చోదకశక్తిగా పనిచేస్తుందని కెసిఆర్ అన్నారు. తద్వారా మాత్రమే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో అభివృద్ధిని సాధించడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలు పటిష్టమై గ్రామీణార్థిక వ్యవస్థ బలోపేతమౌతుందన్నారు. అది స్పిన్ ఆఫ్ ఎకానమికి దారి తీసి తద్వారా సుస్థిరాభివృద్ధి’ జరుగుతుందని సిఎం పేర్కొన్నారు. ప్రాథమికరంగమైన వ్యవసాయరంగంలో చోటు చేసుకునే ప్రగతి ద్వారా, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని, దాని ప్రభావం, ద్వితీయ, తృతీయరంగాలయిన పరిశ్రమలు తదితర ఉత్పత్తి రంగాలకు, సేవారంగాలకు విస్తరిస్తుందని సిఎం వివరించారు. ఇదే సూత్రాన్ని అనుసరించి సమస్త రంగాల్లో వృద్ధిరేటు ఊహించని రీతిలో నమోదవుతోందన్నారు. దీంతో అటు తలసరి ఆదాయం, ఇటు జిఎస్‌డిపి పెరుగుదలకు దోహదం చేసిందన్నారు.
శాస్త్రీయ ఆర్ధిక విధానంతో..
విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి రంగంతో పాటు పలు వృత్తుల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం వెచ్చించే ఖర్చు, సామాజిక పెట్టుబడిగా పరిణామం చెందుతుందనే శాస్త్రీయ ఆర్థిక విధానాన్ని తన కార్యాచరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిందని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ అనుసరిస్తున్న ఇటువంటి రైతు సంక్షేమ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన వివరించారు.
కిసాన్ సర్కార్ అధికారంలోకి రావాలి
రైతు సంక్షేమమే ధ్యేయంగా ఫలితాలను సాధిస్తున్న తెలంగాణ స్పూర్తితో దేశంలో కిసాన్ సర్కార్ అధికారంలోకి రావాల్సిన అవసరమున్నదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ ద్వారా మాత్రమే దేశ రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలైన పరిష్కారం లభిస్తుందని శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News