Saturday, November 16, 2024

చీకట్లను చీల్చిన చంద్రుడు

- Advertisement -
- Advertisement -

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్‌లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా మన దరిదాపులకు రాకపోవడం గమనార్హం. దీంతోపాటు సిఎం కెసిఆర్ అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయానికి ఉచిత కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు, సెలూన్‌లకు, లాండ్రీ షాపులకు ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు పౌల్ట్రీ యూనిట్స్, పవర్‌లూమ్స్‌కు యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం భరిస్తూ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది.

Today is an important meeting on the national party

సబ్సిడీ రూ.36,890 కోట్లు

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు అన్ని రంగాలకు నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేయడంలో ప్రభుత్వం ముందుంది. ఈ నేపథ్యంలో దేశంలోనే విద్యుత్ సరఫరాలో రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. 2014 నుంచి 2021,-22 వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ.36,890 కోట్ల సబ్సిడీని నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. -అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్‌ను అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2014 నుంచి 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లతో వ్యవసాయ రంగానికి రూ.36,890 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించింది.

 

(ఎల్. వెంకటేశం)
దేశంలో 4,05,773 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా కేంద్ర పరిధిలో 99,005 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రాల జెన్‌కో పరిధిలో 1,04, 969 మెగావాట్లు, ప్రైవేటు సెక్టార్‌లో 2,01,799 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి కేంద్రం ప్రయత్నించకపోగా ప్రైవేటు సెక్టార్‌లకు మేలు చేసేలా బిజెపి పార్టీ అనేక చర్యలు చేపడుతోంది. బిజెపి చేపట్టిన సంస్కరణల ఫలితంగా మనదేశంలో 5, 97, 464 గ్రామాల్లో ఇప్పటికీ కరెంట్ లేదంటే అతిశయోక్తి కాదు. 75 ఏళ్ల కాంగ్రెస్, బిజెపి పాలనలో ఇలాంటి సంఘటనలు ఇంకా చూడాల్సి రావడం మన పాలకుల దయనీయ స్థితికి అద్ధం పడుతున్నాయి. ఈ పాటికే మనదేశం 10 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధాన్ని పెంచుకోవాల్సి ఉండగా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ప్రస్తుతం కేంద్రం ప్రైవేటీకరణను తెరపైకి తీసుకురావడం దారుణమని విద్యుత్ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.
మిగతా రాష్ట్రాల్లో…
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే దిగువ మధ్యతరగతి గృహ వినియోగదారులకు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకుం టున్న వారి నుంచి తెలంగాణలో కేవలం రూ.1.45 పైసలను తెలంగాణ వసూలు చేస్తుండగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అదే 50 యూనిట్ల లోపు వినియోగించుకునే వారి నుంచి రూ.3.30 పైసలు, ఉత్తరప్రదేశ్‌లో మూడు రూపాయలు, పంజాబ్ లో రూ.3.49 పైస లు, అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 4.02 రూపాయలు వసూలు చేస్తున్నారు. 100 యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకునే వినియోగదారుల సరాసరి బిల్లు తెలంగాణాలో రూ.239లుగా ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో 861 రూపాయలు బిజెపి పాలిత కర్ణాటకలో రూ.702 లు, పశ్చిమ బెంగాల్ లో రూ.759లు, మహారాష్ట్రలో రూ. 677లు, గుజరాత్‌లో రూ.601లు, కేరళలో రూ.476లు, పం జాబ్ లో రూ.473లు, ఉత్తరప్రదేశ్‌లో రూ.457లుగా ఉంది.

రాష్ట్రంలో 200 యూనిట్లకు రూ.822లు వసూలు
అంతే గాకుండా కుల, మతాలకు అతీతంగా 200 యూనిట్ల విద్యుత్ లోపు వాడుతున్న వినియోగదారులకు సబ్సిడీలు అందించి రాష్ట్రంలో కేవలం నెలకు 200 యూనిట్లు వినియోగిస్తున్న వారి నుంచి 822 రూపాయలను తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తోంది. అదే మహారాష్ట్రలో అదే 200 లోపు యూనిట్లు వినియోగించుకుంటున్న వినియోగదారుల నుంచి అధికంగా 1,689 రూపాయలు, రాజస్థాన్‌లో రూ.1,666లు, పశ్చిమ బెంగాల్ లో రూ.1,630లు, కర్ణాటకలో రూ.1,556లు, మధ్యప్రదేశ్ రూ.1,427లు, గుజరాత్ లో రూ.1,285లు, కేరళలో రూ.1,224లు వసూలు చేస్తున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు.

CM KCR speech in Telangana assembly

గుజరాత్‌లోనూ రైతుల నుంచి డబ్బుల వసూలు
వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్‌కు సైతం తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలన్నీ నెలవారీ బిల్లులు వసూలు చేస్తున్నప్పటికీ 24 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడా ఇవ్వడం లేదు. ప్రధాని మోడీ రాష్ట్రమైన గుజరాత్‌లో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కేవలం 9 గంటలే విద్యుత్ సరఫరా చేస్తోంది. అదే గుజరాత్ లో 9 గంటలు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న ఒక్కో రైతు నుంచి ఒక్కో మోటారు కనెక్షన్ నుంచి నెలకు 667 రూపాయలు వసూలు చేస్తుండగా అదే 9 గంటలు సరఫరా చేస్తున్న ఉత్తరప్రదేశ్ లో నెలకు రూ.2,408, ఇతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌లో నెలకు రూ.4,558, మహారాష్ట్ర నెలకు రూ.1,609, ఏడు గంటలు మాత్రమే విద్యుత్ నందిస్తున్న రాజస్థాన్‌లో రూ.1,800లు వసూలు చేస్తున్నారు. అదే విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న కేరళలో 9 గంటలు విద్యుత్‌ను వినియోగించుకున్నందుకు ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు నెల ఒక్కంటికీ రూ.2,952 రూపాయలు వసూలు చేస్తుండగా, మనదగ్గర వ్యవసాయ వినియోగదారులకు 24 గంటలు ఉచిత నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది.

26.96 లక్షల వ్యవసాయ కనెక్షన్‌లకు…

2014లో రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ అనుకూల విధానాలతో ఎనిమిది సంవత్స రాల్లో వ్యవసాయ స్వరూపం మారిపోయింది. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లో విద్యుత్‌పై సమీక్షించి రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్‌ను అమల్లోకి తీసుకురావడంతో పాటు దేశంలో 24 గంటల పాటు 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నిలవడం గమనార్హం.

5,96,642 మంది ఎస్సీ వినియోగదారులకు…

రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు 101 యూనిట్ల వరకు ప్రతి నెలా 5,96,642 మంది ఎస్సీ వినియోగదారులకు, 3,21, 736 మంది ఎస్టీ వినియోగదారులకు 2017 నుంచి ఇప్పటివరకు రూ.656 కోట్ల విలువగల విద్యుత్‌ను ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేసింది. దీంతోపాటు 29,365 సెలూన్‌లకు, 56,616 లాండ్రీ షాపులకు ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను, 6,667 పౌల్ట్రీ యూనిట్స్‌కు, 491 పవర్ లూమ్స్‌కు యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది.

14,160 మెగావాట్ల డిమాండ్

2014 నుంచి ట్రాన్స్‌కో ద్వారా 400 కెవి సబ్‌స్టేషన్‌లో 17,200 కెవి సబ్‌స్టేషన్‌లు 48,132 కెవి సబ్ స్టేషన్లు 72, ఈహెచ్‌టి సబ్‌స్టేషన్లు 137, 11,107 సికెఎం ఈహెచ్‌టిలైన్, డిస్కంల ద్వారా 33/11 కెవి సబ్ స్టేషన్ 1,038లు 3.65 లక్షల డిటిఆర్‌లను నిర్మించి విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను ప్రభుత్వం పటిష్ట పరిచింది. దీంతోపాటు వేసవికాలంలో 14,160 మెగావాట్లు పీక్ డిమాండ్ సైతం విద్యుత్ సంస్థలు అధిగమించడం విశేషం.

సోలార్ విద్యుత్ ప్రస్తుతం 4,950 మెగావాట్స్

CM KCR will announce National party to dussehra?రాష్ట్రంలో 2.47 శాతం అతి తక్కువ సరఫరా నష్టాలతో తర్వాత 99.98 శాతం ట్రాన్స్‌మిషన్ అవైలబిలిటీతో దేశంలోనే రాష్ట్రం ఘనత సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06 శాతం ఉన్న టి అండ్ డి నష్టాలను 11.01 శాతానికి విద్యుత్ సంస్థలు తగ్గించుకున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్ విద్యుత్ లో సామర్థ్యం 73 మెగావాట్స్ ఉంటే నేడు అది 4,950 మెగావాట్స్‌కు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News