- Advertisement -
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సీరియస్‌గా ఉన్నారు. డ్రగ్స్ అనే మాట వినబడకుండా చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎల్లుండి ప్రగతి భవనంలో డ్రగ్స్ నియంత్రణపై సమావేశమవుతామన్నారు. డ్రగ్స్ వాడుతున్న ఎంతటివారినైనా వదిలేదే లేదని కెసిఆర్ హెచ్చరించారు. డిజిపి ఆధ్వర్యంలో వెయ్యిమందితో నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంటోల్ అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని వదిలిపెట్టొద్దని హెచ్చరించారు.
- Advertisement -