హైదరాబాద్: కర్నాటక రాష్ట్రంలోని కలబురిగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్నాటక రాష్ట్రంలోని కలబురి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 10 మృతి చెందినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం కమలాపూర్ ప్రాంతంలో టెంపో ట్యాక్స్, బస్సు ఢీకొన్నాయి. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో 10 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సు 29 మంది ప్రయాణికులున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా తెలంగాణ వారేనని పోలీసులు వెల్లడించారు.