Monday, December 23, 2024

యావత్ దేశం చూపు ముఖ్యమంత్రి కెసిఆర్ వైపు

- Advertisement -
- Advertisement -

CM KCR should come in national politics

నల్లగొండ: ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నివాసగృహంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ… దేశ ప్రజల ఆకాంక్ష కుడా అదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావ అని మంత్రి జగదీష్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న బిజెపి మతవైషమ్యాలను రెచ్చగొడువుతుందని మండిపడ్డారు.

దేశ అభ్యున్నతికి ఎవరో ఒకరు ముందుకు రావడం అనివార్యమన్నారు. ఇప్పుడు యావత్ దేశం చూపు ముఖ్యమంత్రి కెసిఆర్ వైపు ఉందన్నారు. తెలంగాణ సాధించిన సిఎం కెసిఆర్ దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తారని ఆయన తెలిపారు. అభివృద్ధిలో వెనుక బడుతున్న దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలి అన్నదే కెసిఆర్ సంకల్పమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి నాయకత్వమే శరణ్యమని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్య సాదానలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల పోరాటాలు చారిత్రాత్మకమైనవి మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News