Monday, December 23, 2024

మాటనిలబెట్టుకున్న సిఎం కెసిఆర్.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి హరీష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన సచివాలయం ప్రారంభించిన శుభసందర్భంగా సిఎం కెసిఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైలుపై సంతకం చేశారు. దీనిపై మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన సిఎం కెసిఆర్. అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చిన మాట నిలుపుకున్న సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు’ అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

Also Read: రజినీ ప్రశంసిస్తే.. గజినీలు విమర్శిస్తున్నారు

1,827 స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో మెడికల్ శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మొత్తం 40 విభాగాలకు చెందిన 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ కెసిఆర్ ఫైలుపై సంతకం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News