Monday, December 23, 2024

కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆనందం

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి రాష్ట్ర పాలకుల అసమర్థత పాలన వలన కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. వారి పాలన కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు చాలీచాలని జీతాలతో ఆరిగోసపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు సమ్మెలు, ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. వారి వినతి పత్రాలు సైతం తీసుకోలేదు. వారి మొర ఆలకించే నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ తరుణంలోనే కెసిఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కాంట్రాక్టు ఉద్యోగులు సైతం వెన్నంటి నిలిచారు. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి పలు వేదికలపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పని సిఎం కెసిఆర్ నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నటువంటి 5544 కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ ఫైల్ పై తొలి సంతకం చేసి జిఒ 38 విడుదల చేశారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశాబ్దాల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కల నెరవేరగా దాదాపు 40 శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులలో ఆనందం వెల్లివిరుస్తుంది. వారి కుటుంబాలలో ఆనందం నింపినందుకు కాంట్రాక్టుఉద్యోగులతో పాటు వారి తల్లిదండ్రులు, వారసులు ఆనందంతో సిఎం కెసిఆర్‌కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నారు. స్వరాష్ట్రం సిద్ధించి కెసిఆర్ అధికారం చేపట్టిన తొలి ఏడాది ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం జిఒ నెంబర్ 16ను జారీ చేయగా, కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ జరిగితే సిఎం కెసిఆర్‌కు మంచి పేరు వస్తుందని భావనతో విపక్షాలు ఎన్నో ఆటంకాలు సృష్టించాయి. విపక్షాల ప్రోత్సాహంతో కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు జిఒ 16 పై కోర్టుకు వెళ్ళగా అడ్డంకులు ఏర్పడ్డాయి. వాటిని అధిగమించుటకు ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా నిలిచింది.ఒకవైపు విపక్షాల ద్వంద్వ వైఖరిని కాంట్రాక్టు ఉద్యోగులు నిరసిస్తూ, మరోవైపు కెసిఆర్‌పై నమ్మకంతో స్వరాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనడంలో వెనుకాడలేదు.

విపక్షాలు రెచ్చగొడితే సమ్మెలు, ధర్నాలు చెయ్యలేదు. ఏనాడైన కెసిఆర్ మాత్రమే తమకు న్యాయం చేస్తారు అనే ధీమాతో కెసిఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కాంట్రాక్టు ఉద్యోగులు అండదండగా నిలిచినారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా సిఎం కెసిఆర్ రెగ్యులర్, కాంట్రాక్టు అనే తేడా లేకుండా ఉద్యోగుల ఫ్రెండ్లి ప్రభుత్వంగా ఉంటుందని తెలియజేస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా దేశంలోనే తొలి సారిగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ 2017లో కెసిఆర్ ప్రభు త్వం రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనం కాంట్రాక్టు ఉద్యోగులకు అమలు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైనారు. రాష్ట్ర ప్రభు త్వం 2018లో ఎన్నికలకు వెళ్లే ముందు మంత్రి హరీష్ రావు చొరవతో దేశంలోనే తొలి సారిగా కాంట్రాక్టు ఉద్యోగులు అందరికీ పన్నెండు నెలల వేతనం సదుపాయం కల్పించి ఇతర రాష్ట్రాల కాంట్రాక్టు ఉద్యోగుల మన్నలను పొందారు. 2021లో దేశంలోనే తొలిసారిగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకూ పిఆర్‌సి వర్తించే చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించి అమలు చేయగా స్వరాష్ట్ర ఉద్యోగులతో పాటు ఇతర రాష్ట్రాల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

16 జిఒను సమర్ధించిన హైకోర్టు
గతంలో కెసిఆర్ విడుదల చేసిన జిఒ 16పై విపక్షాలు కోర్టుకు వెళ్లగా 2021 డిసెంబర్ నెలలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జిఒను సమర్థిస్తూ తక్షణమే వారి సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమల్లో భాగంగానే కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు గత ఫిబ్రవరి 6న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఏప్రిల్ నెలలో రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు.

ఈ ప్రకటనకు అనుగుణంగానే ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ వివిధ శాఖల్లో పని చేస్తున్నటువంటి 5544 కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చే ఫైల్‌పై తొలి సంతకం చేసి వారి గుండెల్లో చిరకాల ప్రేమను సంపాదించుకున్నారు. ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాల ద్వారా సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తున్న కెసిఆర్ పై నమ్మకంతో విపక్షాల పార్టీలు రెచ్చేగొట్టే ధర్నాలు, ద్వేషపూరిత కార్యక్రమాలకు లోనుకాకుండా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరించడం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు, రెగ్యులర్ ఉద్యోగులు కూడా కెసిఆర్ పై అమితమైన ప్రేమను చూపిస్తూ, ఆనందం వెలిబుచ్చుతున్నారు. అంతేకాక సిఎం కెసిఆర్ ఉన్నత విద్య పటిష్టతకు బలం చేకూర్చరానీ మేధావులు అభిప్రాయపడుతున్నారు.కాంట్రా క్టు ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన కెసిఆర్‌కు మూడు తరాలకు చెందిన మేం, మా తల్లిదండ్రులు, మా వారసులు జీవితాంతం రుణపడి ఉంటామని సగర్వంగా ప్రకటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News