- Advertisement -
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సెటైర్లు వేశారు. ఆదివారం అసెంబ్లీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లో అదానీ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షం ఎంత పట్టుబట్టినా ప్రధాని మోడీ నోటి నుంచి ఒక్కమాట కూడా రాలేదు. కానీ, మా దోస్తు బాగోతం బయటపడిందనే ఆక్రోశం ప్రధాని మోడీలో కనిపించింది.
ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లను తీసుకువచ్చి.. ఆమె గర్నమెంట్లు కూలగొట్టిందని మోడీ చెప్పారు. రాహుల్ గాంధీ లేచి నువ్వు తక్కువ కూలగొట్టినవా అని అన్నారు. ఇద్దరు.. నువ్వెన్ని కూలగొట్టినవ్ అంటే.. నువ్వు ఎన్ని కూలగొట్టినవ్ అంటున్నరు. ‘ఛోటే భాయ్ సుబానల్లా.. బడేబాయ్ మాష అల్లా’ అన్నట్లు మోడీ, రాహుల్ గాంధీల వ్యవహారం ఉంది అని ఎద్దెవా చేశారు.
- Advertisement -