Monday, December 23, 2024

చెరువుల పునరుద్ధ్దరణతో నీటి సమస్యను పరిష్కరించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

చెరువుల పునరుద్ధ్దరణతో నీటి సమస్యను పరిష్కరించిన సిఎం కెసిఆర్
కేపీహెచ్‌బి: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కూకట్‌పల్లి ఐడీఎల్‌రంగదాముని చెరువు వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిధిగా పా ల్గొని మాట్లాడుతూ గతంలో కాకతీయ రాజులు గొలుసుకట్టు విధానంతో ప్రతి గ్రామాన చెరువులు, కుంటలను తవ్వించి ప్రజలకు తాగు, సాగు నీటిని అందించారని అదేస్ఫూర్తితో తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మళ్ళీ ఈ చెరువులన్నింటికి మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు వె చ్చించి చెరువులను పునరుద్ధ్దరించి భూగర్భ నీటిమట్టాన్ని పెంచడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ గోవర్ధన్, డీసీ రవీందర్, రవికుమార్, కార్పొరేటర్ సబియాగౌసుద్దీన్, ఇరిగేషన్ డిఈ, ఏఈలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News