Wednesday, January 22, 2025

వాళ్లకూ.. మనకూ అదే తేడా: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR speaking in Alwal Sabha

హైదరాబాద్: వైద్యవిధానాన్ని పటిష్టం చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు నిర్వహిస్తున్నామని, మనం వైద్యానికి సంబంధించిన సభ జరుపుకుంటున్నామని సిఎం తెలిపారు. ‘వాళ్లకూ మనకూ అదే తేడా’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పడకలు, సదుపాయాలు పెంచామని చెప్పారు. ఎయిమ్స్ స్థాయిలో టిమ్స్ నిర్మిస్తున్నామని వివరించారు. ఇక్కడ బ్రహ్మాండమైన వైద్యం అందుతుందన్నారు. అల్వాల్ టిమ్స్ లో ప్రత్యేక ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. గాంధీ, నిలోఫర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ నలుదిక్కులా టిమ్స్ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని హెచ్చరించారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే దేశం మనదన్న సిఎం.. శాంతి, సామరస్యం, లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. కులం, మతతం పేరుతో గొడవలు జరిగితే ఎవరూ రారు. గొడవ పడితే మన కాళ్లు మనమే నరుక్కున్నట్టు అవుతుందన్నారు. గుజరాత్ లోనూ రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. పసికూన తెలంగాణలో మాత్రం 24గంటల కరెంట్, సాగునీరు పుష్కలంగా ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News