Wednesday, January 22, 2025

మోడీ ప్రైవేటీకరణ చేస్తే… బిఆర్‌ఎస్ తిరిగి స్వాధీనం చేసుకుంటుంది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కేంద్రంలోని మోడీ సర్కార్ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే.. దానిని మళ్లీ బిఆర్‌ఎస్ తిరిగి తీసుకుంటుందని కెసిఆర్ అన్నారు. తన చేతిలో అధికారం ఉందన్న నెపంతో మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోరికలను, వారి ఆంక్షలను మంటలో కలిపి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మోడీకి ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా… మీది ప్రైవేటైజేషన్ అయితే మాది (బిఆర్‌ఎస్) నేషనలైజేషన్ అని అన్నారు.

విశాఖ ఉక్కును విక్రయించినా…దానిని తిరిగి స్వాధీనం చేసుకుని పబ్లిక్ సెక్టార్‌లో పెట్టుకుంటామని కెసిఆర్ స్పష్టం చేశారు. అలాగే లాభాల్లో ఉన్న ఎల్‌ఐసిని కూడా ఉద్దేశపూర్వకంగానే కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు అనేక కేంద్ర రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిన మోడీ సర్కార్ నిర్ణయాన్నింటిని బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పున సమీక్ష చేస్తామన్నారు. వాటన్నింటిని కాపాడుకుంటామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే విషయంలో ఎపి రాష్ట్ర ప్రజలు కూడా భాగస్వామి కావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News