Monday, December 23, 2024

ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందని కుటుంబం తెలంగాణలో లేదు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం జరుగుతోంది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కెసిఆర్ నివాళులర్పించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకావిష్కరణ కెసిఆర్ చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని కెసిఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో అంతర్భాగమైన రోజు అని, అందుకే ఈ రోజున జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భావించామన్నారు.

ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఎదురొడ్డిందని తెలంగాణ సమాజం అని, ఆనాటి త్యాగాల జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటుందన్నారు. నాటి జాతీయోద్యమనాయకుల కృషిని స్మరించుకుందామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, మహోద్యమానికి సారథ్యం వహించడం తనకందించిన మహదవకాశంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్ధేశానికి ఆదర్శంగా ఉన్నాయని కెసిఆర్ ప్రశంసించారు. 76 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా దేశాన్ని అనేక రుగ్మతలు పట్టి పీడుస్తున్నాయని, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ తెలంగాణలో లేదన్నారు. ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని కొనియాడారు. అభివృద్ధి అంటే ఏమిటో అనతికాలంలోనే దేశానికి చాటిచెప్పగలిగామని, తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నది అన్నమాట అక్షర సత్యమన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిలా పాలమూరు అని కెసిఆర్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News