Friday, December 20, 2024

నా మీద జరిగిన దాడి.. ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరగలేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా నా మీద జరిగిన దాడి.. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అయినా ఏనాడూ బాధపడలేదని, మీ తిట్లే దీవెనలు అనుకొని ముందుకు వెళ్లానని కెసిఆర్ గుర్తు చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ ప్రసంగించారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కెసిఆర్ గుర్తు చేశారు. జలదృశ్యంలో ఉన్న ఆయన ఇంట్లోనే మనం కార్యాలయం ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించామన్నారు. కర్కశకంగా నాటి ప్రభుత్వం మన ఆఫీసును ధ్వంసం చేసిందని, వస్తువులన్నీ బయట పడేశారని, అదే చోట అమరుల స్థూపం కట్టాలని, వారి ఆత్మ శాంతిస్తదని అదే జలదృశ్యంలో ఇంత చక్కగా అమరజ్యోతిని నిర్మించుకున్నామని కెసిఆర్ వివరించారు.

మహాత్మాగాంధీ స్ఫూర్తితో..
పార్టీ ఏర్పాటు తర్వాత, ఉద్యమంలో చాలా మంది నాతో విబేధించారని కెసిఆర్ తెలిపారు. చాలా గొప్పగా ఉద్యమం చేసి, తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేశామని, తెలంగాణ ప్రజలే మమ్మల్ని కాపాడారని ఆయన తెలిపారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ముందుకు సాగామని, హింస రాకుండా చూశామన్నారు.

Also Read: విద్యార్థుల ఉద్యమం అద్భుతం: సిఎం కెసిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News