ముంబై: దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ”దేశ రాజకీయాలపై చర్చించేందుకు మహారాష్ట్రకు వచ్చాను. మా మీటింగ్ తో ఈరోజు తొలి అడుగు పడింది. దేశ అభివృద్ధి, తాజా రాజకీయాలపై చర్చించాం. దేశంలో మార్పులు రావాల్సి ఉంది. త్వరలో హైదరాబాద్ లో నేతలమంతా కలుస్తాం. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం. కేంద్ర ప్రభుత్వ తీరు మారాలి. కేంద్ర సంస్థలను దర్వినియోగం చేస్తున్నారు” అని అన్నారు. ”మహారాష్ట్ర, తెలంగాణ సోదర రాష్ట్రాలు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాం” అని మహా సిఎం ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నాడు. అనంతరం సిఎం కెసిఆర్ అక్కడి నుంచి ఎన్సీపీ అధినేత వరద్ పవార్ నివాసానికి బయల్దేరి వెళ్లారు. సిఎం కెసిఆర్ వెంట ఎంపిలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
CM KCR Speech after meeting with Uddhav Thackeray