Monday, December 23, 2024

దేశమంతా దళితబంధు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సిఎం కెసిఆర్ అంబేడ్కర్ మనవడితో కలిసి ప్రారంభించారు. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం అన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… నా మాటలు కొందరికి మింగుడు పడకపోవచ్చు, మహారాష్ట్రలో బిఆర్ఎస్ గొప్ప స్పందన వస్తోందన్నారు. మహారాష్ట్ర తరహాలోనే దేశమంతా స్పందించే రోజు వస్తుందని సిఎం తెలిపారు. దేశమంతా ఏటా 25 లక్షల కుటంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందని ఆయన పేర్కొన్నారు.

అంబేడ్కర్ కలలు సాకారం కావాల్సిన అవసరం ఇంకా ఉందని ఆయన వెల్లడించారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తపుబోట్టు వరకు కృషి చేస్తానని కెసిఆర్ స్ఫష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుందని సిఎం కెసిఆర్ దీమా వ్యక్తం చేశారు. ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు అన్నారు. వాస్తవ కార్యాచరణ దిశగా ఎస్సీ మేధావులు కదలాలని సిఎం పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News