Monday, December 23, 2024

ఇది విగ్రహం కాదు.. విప్లవం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏటా అంబేడ్కర్ జయంతి జరుపుకుంటున్నామని సిఎం కెఆఆర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ విశ్వ మానవుడు అని సిఎం తెలిపారు. అంబేడ్కర్ సిద్ధాంతం విశ్వజనీనం సార్వజనీనం అన్నారు. అంబేడ్కర్ రాజ్యంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందన్నారు. ఎవరో అడిగితే అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదన్నారు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నామని తెలిపారు. ఇక్కడికి దగ్గరల్లోనే అమరవీరుల స్మారకం ఉంది. అంబేడ్కర్ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం ఉందని తెలిపారు.

అంబేడ్కర్ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం అని కెసిఆర్ అభివర్ణించారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అంబేడ్కర్ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని కెసిఆర్ గుర్తుచేశారు. అంబేడ్కర్ పేరిటి రాష్ట్ర ప్రభుత్వం అవార్డుఇవ్వబోతోందన్నారు. అవార్డు కోసం రూ. 51 కోట్ల నిధి ఏర్పాలు చేస్తున్నామని తెలిపారు. ఏటా అంబేడ్కర్ జయంతి రోజున అవార్డు ప్రధానం చేస్తామని సిఎం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News