Wednesday, November 6, 2024

భారత్ పేద దేశం కానేకాదు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నాందేడ్ : మరఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్‌లో జరిగిన బిఆర్‌ఎస్ సభలో కెసిఆర్ మాట్లాడారు. దేశ నాయకత్వంలో మార్పు రావాలన్నారు. దేశంలో పూర్తి స్థాయిలో కరెంటు, సాగు, తాగునీరు అందడంలేదన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. ప్రధానులు, పార్టీలు మారాయి కానీ దేశంలో పరిస్థితులు మారలేదని దుయ్యబట్టారు. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే నీరు, విద్యుత్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. బిఆర్‌ఎస్‌కు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. దేశ పరిస్థితులను మార్చేందుకు టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చామన్నారు. దేశ నాయకత్వంలో మార్పు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. కుల మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు రాకూడదన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎందుకీ ఈ దుస్థితి ఎలా వచ్చిందని కెసిఆర్ ప్రశ్నించారు. దేశ జనాభాలో 42 శాతం రైతులే ఉన్నారన్నారు. తాము బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదన్నారు. భారత దేశం మేధావుల దేశం అని ప్రశంసించారు. భారత్ పేద దేశం కానేకాదని, చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలంగా మారుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News