Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ కోసం టివి ఛానెల్: కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానెల్‌ను కూడా నడపవచ్చని సిఎం కెసిఆర్ సూచించారు. మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదన్న ఆయన గత ఎన్నికల్లో కంటే ఎన్ని ఎక్కువ సీట్లు వచ్చాయన్నదే ముఖ్యమన్నారు. బిఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

Also Read: వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం: సీఎం కేసీఆర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. మెరుగైన పని తీరు కనబర్చిన వారికే ఈసారి ఎన్నికల్లో టికెట్లు అని వెల్లడించారు. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి లేకుండా చూడాలని అన్నారు. బిఆర్‌ఎస్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి పార్టీ శ్రేణులే టివి ప్రకటనలు, ఫిల్మ్ ప్రొడక్షన్ చేపట్టవచ్చని వివరించారు. ప్రజలతో మాస్ కమ్యూనికేషన్ పెంచుకోవాలని, ప్రభుత్వ పథకాలను భారీ ఎత్తున ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News