Friday, November 15, 2024

దుబ్బాకతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దుబ్బాక : జననీ జన్మ భూమి చ్య స్వ ర్గాదపీ గరియాసి అన్నట్టు పుట్టిన గడ్డను పెరిగిన ప్రాం తాన్ని ఎవరు కూడా మరువరని అలాగే దుబ్బాకకు నా కు ప్రత్యేక అభిమానం ఉందని నేను ఈనాడు ఈ స్థా యిలో ఉన్నానంటే నేను చదువుకున్న దుబ్బాక ప్రభు త్వ పాఠశాల పెట్టిన బిక్షే నని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఓటు వజ్రాయు ధం లాంటిదని దానిని సరైన పద్ధతిలో వినియోగించకుంటే చాలా నష్టపోతామని సిఎం కెసిఆర్ అన్నారు. ప్ర జాస్వామ్యంలో పరిణతి చెందిన దేశాలు మాత్రమే అభివృద్ధి చెందాయని భారతదేశం ఇంకా పరిణతి చెందాల్సి న అవసరం ఉందన్నారు.

తెలంగాణ సాధన కోసం హ క్కుల కోసం పుట్టింది బిఆర్‌ఎస్ పార్టీ అని కాంగ్రెస్ ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిందని అన్నారు. తెలంగా ణ సాధించిన తర్వాత మానవీయ కోణంలో పేద బ డు గు బలహీన వర్గాలను ఆదుకోవాలని ఉద్దేశంతో సం క్షే మ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రా బోయే శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ విజయ దుం దుబి మ్రోగించబోతుందన్నారు. రైతుబంధు దుబారా ఖ ర్చు అని, రైతులకు మూడు గంటల కరెంటు చా లని అంటున్న టి పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు రాబోయే ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కేంద్రం లో ఉన్న మోడీ ప్రభుత్వానికి తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ,ఒక నవోదయ పాఠశాల కావాలని 100 ఉత్తరా లు రాసిన పట్టించు కొని బిజెపికి ఎందుకు ఓటు వేయాలని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. బిజెపికి ఓటు వేస్తే మో రిలో వేసినట్టే అని ఆయన తెలిపారు.

వ్యవసాయ బావుల కాడ మీటర్లు పెట్టనందుకు వేలాది కోట్ల రూపాయలను నిలిపివేసిన కేంద్రం:
– మంత్రి తన్నీరు హరీశ్‌రావు
కేంద్రంలో ఉన్న బి జె పి ప్రభుత్వం వ్యవసా య బావుల మోటర్ల కు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన కెసిఆర్ పెట్టమనిపట్టుపట్టడం తో రాష్ట్రానికి హక్కు గా రావల్సిన 28వేల కోట్ల రూపాయలను కేంద్ర సర్కార్ నిలిపివేసిందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మీటర్ల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కెసిఆర్ అన్నారని గుర్తు చేశారు. రైతులను అన్ని విధాలుగా అం డగా నిలిచింది బిఆర్‌ఎస్ ,కెసిఆరేనని అన్నారు. కాం గ్రె స్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ కష్టాలే మొదలవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణను మోసం చేసిందన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్కడి రైతుల గురించి ఏమి చేయడంలేదని అ దే తెలంగాణలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ 75 శాతం పూర్తయిందని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే మిగిలిన 25 శాతాన్ని సైతం పూర్తి చేస్తామన్నా రు.

మూడవసారి అధికారంలోకి వచ్చేది బిఆర్‌ఎస్ పార్టీయేనని ఇందులో ఎలాంటి ఆప్రోహలు అవసరం లేదన్నారు. కెసిఆర్ సిఎం అయ్యాకే వ్యవసాయం లాభ సా టిగా మారి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. అలాగే రేషన్ షాపుల్లో సోనమసూరి బి య్యా న్ని పంపిణీ చేస్తాన్నామన్నారు. కొత్త రేషన్ కార్డులు అం దించడంతో పాటు ఫించన్ రాకుండా మిగిలిపోయిన వారికి ఫించన్లను అందిస్తామన్నారు. అబద్ధ్దపు ప్రచారా లు చేసే బిజెపిని ప్రజలు నమ్మవద్దన్నారు. దుబ్బాకలో చదువుకున్న కెసిఆర్‌కు దుబ్బాక ప్రజలంటే ఎంతో ప్రే మ ఉంటుందన్నారు. సవతి తల్లి చూపే కాంగ్రెస్, బిజెపి కావాలా కన్నతల్లి ప్రేమ చూపించే కెసిఆర్ కావాలో ప్ర జలే ఆలోచించాలన్నారు. బిఆర్‌ఎస్ మెనిపెస్టో ఎంతో బాగుందని ఈ విషయాలపై పార్టీ శ్రేణులంతా గడప గ డపకు తెలియజేయాలన్నారు. ప్రభాకర్‌రెడ్డిని బారీ మె జార్టీతో గెలిపించాలని కోరారు.

భగవంతుని దయ .. ప్రజల ఆశీస్సులతో మళ్లీ
మీ ముందుకు వచ్చా:బిఆర్‌ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి
ప్రజల నుంచి తనకు వస్తున్న మంచి ఆదరణ ను చూసి ఓర్వలేకనే క త్తి దాడి చేయించారని బిఆర్‌ఎస్ దుబ్బాక అ భ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. 15 రోజులు నరకం చూశానని అ యినా భగవంతుని దయ ప్రజల ఆశీస్సులతో మళ్లీ మీ ముందుకు వచ్చి నిలబడ్డానని అ న్నారు. తనకు ఇప్పటి వరకు ఆసుపత్రులు , సూది మం దులు తెలియవని కత్తి దాడితోనే ఆసుపత్రిలో చేరానని అన్నారు. తాను ఆసుపత్రిలో ఉన్నంత కాలం కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధులు కోడి కత్తి డ్రామాలు అని ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నా రు. అయినా బిఆర్‌ఎస్ శ్రేణులంతా ప్రచారాన్ని ఆపకుం డా తన గెలుపుకు ఎంతో కృ షి చేస్తున్నారన్నారు. బిజేపి, కాంగ్రెస్‌ల అబద్దపు ప్రచారాలను వారి మాయ మాటలను ప్రజలు నమ్మడం లేదని కెసిఆర్ బిఆర్‌ఎస్ నే ప్రజలు ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ,జె డ్పీ చైర్ పర్సన్ వేలేటి రో జా రాధాకృష్ణ శర్మ, మా జీ ఎ మ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, వివిధ మండలాల జడ్పిటిసి లు ఎంపీపీలు ఎంపీటీసీలు, సర్పంచులు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీ సం ఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News