Wednesday, January 22, 2025

రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అందరికీ జోహార్లు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందిరికీ సిఎం కెసిఆర్ జోహార్లు తెలిపారు. తెలంగాణ సచివాలయం ప్రారంభం అనంతరం సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారని గుర్తుచేశారు. మత్తడి తొక్కుతున్న చెరువులే రాష్ట్ర పునర్నిర్మాణానిక తార్కాణం అని సిఎం పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో చెరవుల రూపురేఖలు మార్చామన్నారు. విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానం అన్నారు. చెక్ డ్యామ్ ల వల్ల వేసవిలోనూ నీళ్లు పుష్కలంగా ఉన్నాయన్నారు.

Also Read: నేడు ప్రధాని మోడీ 100వ ‘మన్‌కీ బాత్’ ప్రసారం!

వేసవిలో దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలు సాగయ్యాయయని సిఎం తెలిపారు. దేశంలో సాగైన దాంట్లో 54 లక్షల ఎకరాలు మనవద్దే సాగైందన్నారు. తెలంగాణ పల్లెలు ఎన్నో అవార్డులు సాధిస్తున్నాయి. కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం రాష్ట్ర పునర్నిర్మాణమే, వలసలు వెళ్లిన పాలమూరు బిడ్డలు వెనక్కి రావడం పునర్నిర్మాణమే, ఆచరణాత్మక విధానాలతో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. తప్పసరి పరిస్థితుల్లో కొన్ని చోట్ల కూలగొట్టి కట్టామన్నారు. సమ్మిళిత అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్తోందని ఆయన వెల్లడించారు. ఐటిలో బెంగళూరును దాటి తెలంగాణ దూసుకుపోతోందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News