Monday, December 23, 2024

ఢిల్లీ కోట‌లు బ‌ద్ద‌లు కొడుతాం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

జ‌న‌గామ: ‘నరేంద్ర మోడీ జాగ్రత్త.. ఢిల్లీ కోట‌లు బ‌ద్ద‌లు కొడుతాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రదానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనగాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ”న‌రేంద్ర మోదీతో రెండేండ్ల నుంచి పంచాయితీ న‌డుస్తోంది. నరేంద్ర మోడీ విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట బావుల వ‌ద్ద‌ మోటార్లకు క‌రెంట్ మీట‌ర్లు పెట్టమట్టుండు. మా ప్రాణం పోయినా స‌రే బావుల వ‌ద్ద‌ మోటార్లకు క‌రెంట్ మీట‌ర్లు పెట్టం. ఏం చేస్తావో చేసుకో విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయం. అవసరమైతే తిర‌గ‌బ‌డుతాం.. కొట్లాడుతాం. మోడీ జాగ్రత్త.. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం. ఇది తెలంగాణ పులిబిడ్డ‌. మీ ఉడుత‌ ఊపుల‌కు, పిట్ట బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌రు. కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్వ‌రు. మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌రు. నువ్వు ఇవ్వ‌కున్నా మంచిదే. ఈ దేశం నుంచి నిన్ను త‌రిమేసి.. ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు డిజీల్ రేట్లు పెరిగాయి. దాంతో రైతుల‌కు ట్రాక్ట‌ర్ల‌తో దున్న‌డం భార‌మైంది. ఆదాయం రెట్టింపు చేయడం ఏమో కానీ.. రైతుల పెట్టుబ‌డి రెట్టింపు చేసిండు. న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం రైతులు, పేద‌ల వెంబ‌డి ప‌డ్డాడు. ల‌క్ష‌ల కోట్లు కుంభ‌కోణాలు చేసి, బ్యాంకుల‌ను మోస‌గించిన వారికి టికెట్లు కొని లండ‌న్‌కు పంపిస్తారు. వాల్లు అక్క‌డ పిక్‌నిక్ చేస్తున్నారు. దేశం గురించి కూడా కొట్లాడాలి.దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తాం. జాతీయ రాజ‌కీయాల్లో ప్రాతినిధ్యం వ‌హించాలి. బీజేపీ వాళ్ల‌ను మేం ట‌చ్ చేయం.. మ‌మ్మ‌ల్ని ముట్టుకుంటే నాశ‌నం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్ర‌స్ లేకుండా పోతరు. ప్ర‌జ‌ల శ‌క్తితోనే తెలంగాణ‌ను సాధించుకున్నాం. అద్భుత‌మైన పంట‌ల‌ను పండించుకున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వ‌రుస‌లో ఉన్నాం.” అని పేర్కొన్నారు.

CM KCR Speech at Jangaon Public Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News