- Advertisement -
పాలమూర్ పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగసభలో కొడంగల్ నియోజవర్గానికి తెలంగాణ సిఎం కేసీఆర్ర్ వరాలు ప్రకటించారు. కొడంగల్ నియోజకర్గంలో రైతులకు సాగునీరు అందించేందుకు పాలమూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుండి కాలువల నిర్మాణానికి త్వరలోనే టెండర్ల నిర్వహిస్తామని సిఎం కేసీఆర్ అన్నారు.
నియోజకవర్గానికి గతంలో ఇచ్చిన 3వేల డబుల్ బెడ్ రూం ఇండ్లకు అదనంగా మరో వెయ్యి ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.నియోజకవర్గానికి అదనంగా ఎస్‌డిఎఫ్ నిధులు రూ.20కోట్ల అందిస్తామని ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గానికి వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ను స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -