Sunday, January 19, 2025

ఇక తెలంగాణ‌లో క‌రువు రాదు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR speech at Mallanna Sagar Inauguration

సిద్దిపేట: దేశం మొత్తం క‌రువు ఉన్నా.. కాళేశ్వరంతో తెలంగాణ‌లో క‌రువు రాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లాలో మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును బుధవారం సిఎం కెసిఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ”కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయం మలన్న సాగర్. ప్రాజెక్టు పనులు ఆపాలని ఓ దుర్మార్గుడు కోర్టుకెళ్లాడు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు వందలాది కేసులు వేశారు. కేసులు వేసినా ఇంజినీర్లు భయపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద బహళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. మల్లన్న సాగర్ ఓ పెనింగ్ తో కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిపూర్ణం. కాళేశ్వరంతో 13 జిల్లాలకు సాగు, తాగు నీరు కష్టం తీరనుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు వరప్రదాయినిగా మల్లన్న సాగర్ నిలువనుంది. మల్లన్న సాగర్ కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 58వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. మల్లన్న సాగర్ కాదు.. ఇది తెలంగాణ జల హృదయ సాగర్. మంచినీటి సమస్యను శాశ్వతంగా దూరం చేసే ప్రాజెక్టు ఇది. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ఒక్క‌టే కాదు.. పాల‌మూరులోనూ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని కోరుతున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 70 టీఎంసీలు నిల్వ చేసే రిజ‌ర్వాయ‌ర్లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. 50 డిగ్రీల ఎండ‌లో గోదావ‌రి న‌దిలో ఇంజినీర్లు ప‌డ్డ క‌ష్టం వృథా కాలేదు. ఎంతో మంది ఎన్నో ర‌కాల క‌ష్టాలు ప‌డి ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకున్నాం. క‌రువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వ‌రం ప్రాజెక్టు. దేశం మొత్తం క‌రువు ఉన్నా తెలంగాణ‌లో క‌రువు రాదు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగ‌మైన మ‌ల్ల‌న్న సాగ‌ర్‌ను నింప‌డానికి మూడు సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. 50 టీఎంసీల ప్రాజెక్టు కాబ‌ట్టి.. మూడు సంవ‌త్స‌రాల నాటికి మొత్తం నింపేస్తారు. ప్రస్తుతానికి 10.64 టీఎంసీల నీళ్లు తెచ్చాం. మ‌రో 5 టీఎంసీలు తీసుకొచ్చి నింపుతారు. మ‌ళ్లీ వర్ష‌కాలంలో ఈ ప్రాజెక్టును నింపుతారు. ప్రాజెక్టు గురించి క‌నీస అవ‌గాహ‌న లేనివారు చేస్తున్న ఆరోప‌ణ‌లను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ు. ఈ ప్రాజెక్టు కోసం నిర్వాసితుల త్యాగం అసమానం. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తాం” అని చెప్పారు.

CM KCR speech at Mallanna Sagar Inauguration

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News