Sunday, January 19, 2025

ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఎన్‌కౌంటర్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ గద్వాల ప్రతినిధి: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని వీరి మా టలు, వారి మాటలు విని మోసపోతే గోస పడుతామని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలలో భాగంగా ఆదివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాలలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. పదేళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని చేసుకున్న అభివృద్ధి అంతా మీ కళ్ల ముందే ఉందన్నారు. ఇప్పటికి చేసుకున్న అభివృద్ధి గొప్పదని ఇదే స్ఫూర్తితో అన్ని రం గాలలో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, ఇందిరమ్మ రా జ్యం అంటే మళ్లీ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌లు, కాల్చివేతలు, మతకల్లోలాలేనా అ ని కెసిఆర్ ప్రశ్నించారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు, కరువు కరాళ నృ త్యం చేసిందని ఆ తరువాత ఎన్‌టి రామారావు పార్టీ పెట్టి రెండు రూపాయల కు కిలో బియ్యం ఇయ్యాల్సిన దుస్థితికి కారణం మీ ఇందిరమ్మ రాజ్యమే కదా అని అన్నారు. ఆనాడు కరువుతో గంజి కేంద్రాలను ఏర్పాటు చేస్తే నేడు తెలంగాణ మూడు కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించి అన్నపూర్ణగా మారిందన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు చెబుతున్న ఇందిరమ్మ రాజ్యాన్ని నెమరవేసుకోవాలని ఆ తర్వాత ఎవరు ఉంటే రాష్ట్రం బాగుపడుతుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో పరిణితి రాలేదన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి అని, ఎవరో ఒకరు గెలుస్తారు అ క్కడితో అయిపోదని 5ఏళ్ల పాటు మన జాతకాలు, తలరాతలు రాసే ఎన్నికల ని, అలాంటి ఎన్నికలలో చాలా ఆలోచించి ఓటు వేయాలని కెసిఆర్ అన్నారు.

కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ బంద్..ధరణికి రాంరాం..!!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ బంద్ అవుతుందని, ధరణికి రాంరాం పలుకుతారని దళిత బంధుకు జై భీం అంటారని కెసిఆర్ అన్నారు. పిసిసి అధ్యక్షుడు 24 గంటల కరెంట్ అవసరం లేదని, రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే చాలని చెబుతున్నారని, 24 గంటల కరెంట్ కావాలా లేదా 3గంటల క రెంట్ కావాలా చేతులెత్తి చెప్పాలని కోరగా సభలలో పాల్గొన్న ప్రజలు కేరింత లు కొడుతూ 24 గంటల కరెంట్ కావాలని హర్షధ్వానాల మధ్య తమ అభిష్టా న్ని వ్యక్తం చేశారు. మరో కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజల ప న్నులతో రైతులకు రైతుబంధు ఇచ్చుడే వేస్టు అని చెబుతున్నారని, రైతు బంధు ఇవ్వాలా వద్దా అని ప్రజలను కోరగా చేతులెత్తి రైతు బంధు కావాలని హర్షధ్వా నాల మధ్య తమ మద్దతును తెలిపారు. కెసిఆర్ స్పందిస్తూ మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధును ఎకరాకు రూ. 16వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ,

భట్టి విక్రమార్కలు తాము అధికారంలో కి వస్తే ధరణిని బంగాళాఖాతంలోకి విసిరేస్తామని చెబుతున్నారని, ధరణి ఉం డాలా వద్దా అని సభికులను ప్రశ్నించారు. హర్షధ్వానాల మధ్య ప్రజలు ధరణి ఉండాలని ముక్తకంఠంతో తెలిపారు. ధరణిపోతే రైతుకు నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కూడా రైతు భూమిని మార్చడానికి వీలు లేకుండా ఈ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ధరణి తీసివేస్తే మళ్లీ పట్వారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఎల్లయ్య భూమిని మల్లయ్యకు, మల్లయ్య భూమిని ఎల్లయ్యకు మార్పిడి చేసి పంచాయితీలు పెట్టే పరిస్థితులు దాపురిస్తాయన్నారు. ధరణి తీసేసి మళ్లీ పంచాయతీలు పెట్టేందుకు కౌలు రైతు కాలం, కబ్జా కాలాలను రికార్డులలో పొందుపరిచి పంచాయతీలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని, వారి కుట్రలను తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తోవకొచ్చిన తెలంగాణ ఎడారే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు కష్టపడి తోవకొచ్చిన తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పేర్లన్ని పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. వాటిని పూర్తి చేయాలన్న సోయి లేకుండా రైతుకు నీరు ఇవ్వాలన్న ఇంకిత ఙ్ఞానం లేకుండా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగునీరు ఇచ్చిన చరిత్ర బిఆర్‌ఎస్‌దన్నారు. తాను హెలికాప్టర్‌లో వస్తుంటే డాంబర్ రోడ్ల మీద వరి ధాన్యం రాశులుగా కుప్పలు పోసి దర్శనమిస్తుందన్నారు. నేడు 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తూ గతంలో వ్యవసాయం చేయడం తెలంగాణ రైతులకు రాదని ఎగతాళి చేసిన వారికి రైతులు పండిస్తున్న ధాన్యమే చెంపపెట్టు అన్నారు.

ఒకరు రైతుకు విద్యుత్తు 3 గంటలు చాలు అంటాడని…మరొకరు రైతు బంధు ఇవ్వడమే వేస్టని చెప్పే వీరు అధికారంలోకి వస్తే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో ఓటు వేయాలని అడుగుతున్న పార్టీల చరిత్రను ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని కెసిఆర్ అన్నారు. 50 ఏళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి, పదేళ్లలో బిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలను గుర్తించి తీర్చేది తెలంగాణ కోసం పుట్టిన బిఆర్‌ఎస్‌కే సాధ్యమని కెసిఆర్ అన్నారు. తెలంగాణను బాగు చేయాలన్న సోయి ఢిల్లీలో కూర్చున్న పార్టీల పెద్దలకు ఎందుకు ఉంటుందని కెసిఆర్ ప్రశ్నించారు. మన కోసం పరితపించే పార్టీ ఏదో చర్చించుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు.

మోడీ మీటర్లు పెట్టాలంటే ఒప్పుకోలేదు
తెలంగాణలో రైతులు సాగు చేసుకునే బోర్ మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ఆదేశించిన ససేమిరా ఒప్పుకోలేదని, ఆ కోపంతో తమకు రావాల్సిన రూ. 25వేల కోట్ల రూపాయలను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా రైతు సంక్షేమం కోసం ఒప్పుకోలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పిసిసి అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్ ఇచ్చి 10 హెచ్‌పి మోటార్లను రైతులు పెట్టుకుంటే సరిపోతుందని చెప్పడం అవివేకమన్నారు. తెలంగాణలో 30 లక్షల మోటార్లు ఉన్నాయని, ఆ మోటార్లన్ని మార్చాలంటే రూ. 30 వేల కోట్ల రూపాయలు అవుతుందని, ఇది సాధ్యమయ్యే పనేనా అని కెసిఆర్ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఉండాలా మూడు గంటల కరెంట్ చాలా అని సభికులను ప్రశ్నించగా 24 గంటల కరెంట్ కావాలని హర్షధ్వానాల మధ్య ప్రజలు మద్దతు తెలిపారు.

తెలంగాణలో సంపద పెరిగిందని, అందుకు అనుగుణంగా రాబోయే కాలంలో 5వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నామని కెసిఆర్ ప్రకటించారు. రాయి ఏందో..రత్నమేందో గుర్తుపట్టాలని, అలాంటి అభ్యర్థులకే ఓటు వేసి గె లిపించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు 5 ఏళ్లు తమ తలరాతలను మార్చేదన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని పక్క పార్టీ వాడికి ఓటు వేస్తే తలరాతలు వంకర చేస్తదని కెసిఆర్ అన్నారు. మంచి ఆలోచనతో ఓటు వేయాలని, మీ వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు అని కెసిఆర్ అన్నారు. ఇప్పటి వరకు మీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారు ఎవరో…? మభ్య పెట్టి అధికారం కోసం వెంపర్లాడుతున్న వారెవరో గుర్తించుకోవాల్సిన అవసరం ఓటర్లుగా మీపై ఉం దన్నారు.

పాలమూరు రంగారెడ్డితో 20 లక్షల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతుందని, కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ వద్ద కృష్ణానదిపై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించుకోవడం జరిగిందని కెసిఆర్ అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తై కరువుతో కొట్టుమిట్టాడిన పాలమూరు జిల్లా పచ్చబడిందన్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తైతే ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని కెసిఆర్ అన్నారు. సాగునీటి రంగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆదర్శంగా నిలవబోతుందని ఇదంతా రైతులు, ప్రజలు గుర్తించాలని కోరారు.

మీ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత…
బిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ ప్రాంతాల అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తి అని, డబ్బు సంపాదించాలన్న ఆశతో రాజకీయాల్లోకి రాలేదని, నాగర్‌కర్నూల్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నాడని, సాగునీటితో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మూడు రోజుల క్రితం మార్కండేయ లిఫ్ట్‌ను పూర్తి చేసి ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరును ఇచ్చేందుకు చేసిన కష్టాన్ని, కృషిని కెసిఆర్ అభినందించారు. మర్రి జనార్ధన్ రెడ్డి కోరిన ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాల, ఐటి టవర్, పరిశ్రమల ఏర్పాటు కావాలని కోరారని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇవన్ని మంజూరు చేస్తానని కెసిఆర్ హామి ఇచ్చారు. అదే విధంగా అలంపూర్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల బిఆర్‌ఎస్ అభ్యర్థులు విజేయుడు, బీరం హర్షవర్ధన్ రెడ్డి,

గుర్క జైపాల్ యాదవ్‌లు తమ ముందు ఉంచిన అభివృద్ధి డిమాండ్లన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే జిఓలు జారీ చేసి మంజూరు ఇస్తామన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్, చెన్నోనిపల్లిని పూర్తి చేస్తామని, నెట్టెంపాడు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. వంద పడకల ఆసుపత్రిని నెలకొల్పుతామన్నారు. అలంపూర్‌కు కరువు రాకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని విజేయుడిని గెలిపించే బాధ్యత మీరు చూడాలని అన్నారు. ఈ ప్రజా ఆశీర్వాద సభలలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపి రాములు, మాజీ మంత్రి, సీనియర్ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విజేయుడు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, జైపాల్ యాదవ్‌లతో పాటు బిఆర్‌ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News