సంగారెడ్డి: జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొని మాట్లాడారు. ”14 ఏళ్లు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్నో అపనమ్మకాలు కల్పించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. దేశంలో ఏ ఒక్క రాష్ట్రం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. శాశ్వతంగా మంచినీటి సమస్య తీరింది. వృద్ధులకు పెన్షన్లతో గౌరవం పెరిగింది. ఏడేళ్లలో తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. నాలుగు లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. ప్రాజెక్టుల కోసం నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి. సంగారెడ్డి జిల్లాలో 699 గ్రామాలకు నిధులు పంపుతున్నాం. నారాయణఖేడ్ కే ఎక్కువ రైతుబంధు నిధులొస్తున్నాయి. దేశంలో రైతుబందు పథకం ఎక్కడా లేదు. దేశంలో దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోంది. తెలంగాణను బాగుచేసినట్లే దేశ రాజకీయాల్లోనూ పోరాడుతా. బంగారు తెలంగాణ ఎట్లా చేసుకున్నమో.. బంగారు భారత దేశాన్ని కూడా అట్లే తయారు చేసుకుందాం” అని అన్నారు.
CM KCR Speech at Narayankhed Sabha