Wednesday, January 22, 2025

చిల్లరమల్లర రాజకీయాల కోసం పింఛన్లు ఇస్తమా?

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: చిల్లరమల్లర రాజకీయాల కోసం పింఛన్లు ఇస్తలేమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ..  “ఏం చేసినా అర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉండాలని పెద్దలు చెప్పారు. 2014లో ఒంటరిగా ఎన్నిలకు వెళ్లాలని నిర్ణయించిన తర్వాత.. మళ్లీ మన గవర్నమెంట్‌ వస్తుందని ఎన్నికల మేనిఫెస్టో రాస్తున్నాం. రాసే సమయంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలనే చర్చ జరిగింది. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.250, రూ.300 చేద్దామని కొందరు చెప్పారు. మాజీ ఐఏఎస్‌ అధికారి లెక్కలు తీసి రూ.430 ఇస్తే చాలని చెప్పారు. ఆ సమయంలో మనం పెన్షన్‌ ఎందుకు ఇస్తం? అని అడిగాను. చిల్లరమల్లర రాజకీయాల కోసం ఇస్తమా? పెన్షన్లు ఇచ్చేందుకు పరమార్థం ఉందా? లేదా? అని అడిగినప్పుడు చాలా మంది పాలిటిక్స్‌, సాయం కోసం ఇస్తామని రకరకాలుగా చెప్పారు.

అనేక కారణాలతో భర్త చనిపోయిన మహిళ, పిల్లల నిరాధారణ వృద్ధులు, నిరుపేదల వృద్ధులు, ఒంటరి మహిళల, ఎవరూ పట్టించుకోకపోయిన బీడీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం అవసరం తీరే విధంగా ఇచ్చినా అర్థవంతంగా ఉంటది.. లేకపోతే ఇవ్వకపోవడం మంచిది అని చెప్పాం. ఆ తర్వాత రూ.1000 ఇవ్వాలని చెప్పాని, ఆ తర్వాత పెంచుకుందామని చెప్పామన్నారు. ప్రస్తుతం రూ.2వేలు ఇస్తున్నామన్నారు. టీవీలు, సోషల్‌ మీడియాలో ప్రత్యక్షంగా చూశాను. చాలా మంది వృద్ధులు మాకొడుకులు చూడనప్పుడు బావులు, చెరువుల్లో పడి చనిపోదుము. మాకు ఇవాళ ఆ దుర్ఘతి లేదు. రేషన్‌ కార్డు ఉంది.. బియ్యం వస్తున్నయ్‌. రూ.2లు ఠంచన్‌గా వస్తున్నాయ్‌ అని మారుమూల ప్రజలు చాలా సంతోషంగా చెబుతున్నారు. ఏలికలకు, పాలకులకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దీనికి మంచిన సంతృప్తి, గొప్ప గౌరవంగా ఉంటుందనుకోను” అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News