హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుతం వెలుగు జిలుగులతో విరాజిల్లుతోందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసంగించారు. గతంలో కరెంట్ షాక్‌లతో రైతులు చనిపోయారని, కానీ, నేడు 24 గంటల కరెంట్‌తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారని సిఎం తెలిపారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయని కెసిఆర్ అన్నారు.
Also Read: గోల్కొండ బోనాలకు ముహూర్తం ఖరారు
ఆగమైపోయిన అడవులు పునర్నిర్మాణం చేసుకున్నామని, హరితశోభను వెదజల్లుతున్నాయన్నారు. వలసపోయిన పాలమూరు వాసులు తిరిగొచ్చి తమ పొలాల్లో పనులు చేసుకుంటున్నారని కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. కూలీలు సరిపోక ఇతర రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వస్తున్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా జరిగిందన్నారు. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీకఅని, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగే నీటిని ఆదిలాబాద్‌లోని గోండు ప్రజలు సైతం తాగుతున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో మత కల్లోలాలు లేవని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.