సిద్దిపేట: తెలంగాణలో ధరణి పోర్టల్ తో రైతుల భూ సమస్యలు తీరిపోతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్టాడారు. సిద్దిపేటలో తొలి కలెక్టరేట్ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ధరణితో రైతుల భూ సమస్యలు తీరిపోతున్నాయని, ఒక్క ధరణి పోర్టల్ కోసం మూడేళ్లు కష్టపడ్డట్లు తెలిపారు. ఇప్పుడు ధరణి ద్వారా 6 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. రాష్ట్రంలో 93.5 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని చెప్పారు. ధరణిలో నమోదైన భూమి హక్కులు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే రైతుబంధు జమచేస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు 95శాతం సద్వినియోగం అవుతోందని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే రైతుబంధు జమచేస్తున్నట్లు చెప్పారు. నకిలీ విత్తనాలపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు.
CM KCR Speech at Siddipet