Sunday, November 17, 2024

గతం కంటే 7 నుంచి 8 సీట్లు అధికంగా గెలుస్తాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి పురోగతిపై జరిగిన చర్చలో పాల్గొన్న నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తలసరి ఆదాయం పెరిగితే దేశం, రాష్ట్రం అంత పురోగతి సాధించిందన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజు మన స్థానం ఎక్కడ ఉందో గమనించాలని, 25 వేల మెగావాట్ల రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందన్నారు.

ఇప్పుడున్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కెసిఆర్ ప్రశంసించారు. పరిపాలన చేతకాదన్న వాళ్ల కంటే మన తలసరి ఆదాయం లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉందనికొనియాడారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల కంటే మనం ఎంతో పురోగతి సాధించామని కెసిఆర్ మెచ్చుకున్నారు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ పంపిణీ పూర్తి చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గతం కంటే 7 నుంచి 8 సీట్లు అధికంగా గెలుస్తామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. పాలకులకు నీతి, నిజాయితీ ఉంటే ప్రకృతి కూడా కరుణిస్తుందని ప్రశంసించారు. వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మెచ్చుకున్నారు. ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం లేకుంటే తుంగతుర్తి, సూర్యాపేట, మల్లన్నసాగర్, కొంచపోచమ్మకు నీళ్లు ఎక్కడివి అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలకు ఏడుపు ఎందుకు అని అడిగారు. కాళేశ్వరం పుణ్యమా అని నేడు అద్భుతమైన జలధారలు పారుతున్నాయని కొయాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News