Monday, November 18, 2024

అప్పుడు పాలమూరును పట్టించుకోలేదు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో పాలమూరును పట్టించుకోలేదని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా ఎలా ఉండేదో అందరికీ తెలుసునన్నారు. దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగించారు. పిడికెడు మందితో ఆనాడు యావత్ తెలంగాణను నిద్ర లేపానని, మొండి పట్టుదలతో తెలంగాణను సాధించుకున్నానని, మీరంతా వెంటపడి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు.

9 ఏళ్లలో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింతో మీ కళ్ల ముందే ఉందని కెసిఆర్ చెప్పారు. కరివేన రిజర్వాయర్ త్వరలోనే పూర్తి అవుతుందని, మరో 70 వేల ఎకరాలకు ఆయకట్టకు సాగునీరు అందుతోందని, ఎవరూ అధికారంలో ఉంటే మేలు జరుగుతుందో ఆలోచించుకోవాలని కెసిఆర్ తెలియజేశారు. ఆలకు చెక్ డ్యామ్ వెంకటేశ్వర్ రెడ్డి అని పేరు పెట్టాలని, లక్ష ఎకరాల్లో వరి సాగు చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో ఆశించిన పరిణతి దేశంలో లేదని, ప్రతి ఒక్కరూ అభ్యర్థి మంచి చెడునూ చూడాలని కోరారు. సమైక్య రాష్ట్రంలో గంజి కేంద్రాలు పెట్టించిన గతి ఏ పార్టీతో తెలుసుకోవాలని, ఉన్న తెలంగాణ ఊడగొట్టింది కాంగ్రెస్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News