Sunday, December 22, 2024

సంపద పెంచి పేదలకు పంచుతున్నాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు తెలంగాణ పూర్ణకలశంలా నిండుకుండలా తొణికిసలాడుతోందని ముఖ్యమంత్ర కె చంద్రశేఖర్ రావు తెలిపారు.  77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గోలొక్కండ కోటలో సిఎం కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన అందరికి నివాళులర్పించారు. ఈసందర్భంగా కెసిఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలందికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు తెలంగాణ ఆచరిస్తున్నది… దేశం అనుసరిస్తుందని పేర్కొన్నారు. సంపద పెంచి పేదలకు పంచుతున్నామని, విద్యుత్ రంగంలో అద్భుత విజయాలు సాధించుకున్నామన్నారు.

Also Read: గాంధీ చూపిన మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం: గుత్తా

24 గంటల కరెంట్‌తో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతోందని కొనియాడారు. ప్రగతి ఫలాలు అందికి అందిన నాడే స్వాతంత్య్రానికి అర్థం వస్తుందని కెసిఆర్ చెప్పారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో శాంతియుతంగా పోరాడి స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. పడావు పడ్డ భూములలో తెలంగాణ బాధలు పడ్డదని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపెడుతున్నామని కెసిఆర్ మెచ్చుకున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలలో ఇంకా పేదరికం తొలిగిపోలేదన్నారు. ఆర్‌టిసి సంస్థను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో కలిపామన్నారు. వంద శాతం ఇండ్లకు సురక్షితమైన నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ ప్రశంసించారు. అన్ని ఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తీవ్రమైన వివక్ష, దోపిడీకి గురైందని చెప్పారు. గతంలో ఎటు చూసిన ఆకలి కేకలు, ఆత్మహత్యలు కనిపించేవని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News