Friday, December 20, 2024

దేశంలో ఏం జరుగుతోందో మనసు విప్పి ఆలోచన చేయాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు సభ కోసం పాదయాత్ర చేస్తూ వచ్చిన 20 వేల మందికి పాదాభివందనం చేస్తున్నానని సిఎం కెసిఆర్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చండూరు వేదిక నుంచి కెసిఆర్ ప్రసంగించారు.  ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో మనుగోడు ప్రజలకు తెలుసునని, ఉప ఎన్నిక ఫలితం కూడా మీరేప్పుడో తేల్చశారని తనకు తెలుసన్నారు. గత వారం రోజులుగా అనేక చర్చోపచర్చలు జరిగిన సంగతి ప్రజలకు తెలుసునని, న్యాయమేందో ధర్మమేందో అన్నీ ప్రజలకు తెలుసునని చెప్పారు. ఎన్నికలు రాగానే కొందరికి మాయ రోగం వస్తుందని, గాయి గత్తర అయితరని, ఎన్నికలు అనగానే విచిత్ర వేషాలు వేసుకొని అనేక రకాల మనుషులు వస్తుంటారని కెసిఆర్ పరోక్షంగా చురకలంటించారు.

తాము చెప్పిన మాటాలు విని ఇక్కడే వదిలేసి వెళ్లకండని, ఇంటికి వెళ్లిన తరువాత తన మాటాలపై చర్చలు పెట్టాలన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే శక్తివంతమైన ఆయుధమని, ఓటు తలరాత మార్చేది కాబట్టి ఆలోచించి ఓటేస్తే బతుకులు బాగుపడుతాయన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోందో మనసు విప్పి ఆలోచన చేయాలన్నారు. కరిచే పాము అని తెలిసి కూడా మెడలో వేసుకుంటామా? అని బిజెపిని ఉద్దేశించి ప్రజలను కెసిఆర్ అడిగారు. పాములం కరుస్తాం అని చెప్పిన బిజెపోళ్లకు ఓటేద్దామా? అని ప్రశ్నించారు. బిజెపోళ్ల నాటాకాలు నడవయని, మీ ప్రలోభాలకు ఓటర్లు లొంగరని, ప్రజలకు తెలియనంత వరకే వాళ్ల మోసాలు సాగుతాయన్నారు. ఆలోచించి ఓటు వేస్తే మునుగోడు, నల్లగొండ, రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News