నల్గొండ: మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్ సమస్యతో ఎంత బాధపడిందో అందరికీ తెలుసని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఫ్లోరైడ్ బాధితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి చూపించిన మన మెర ఎవరూ వినలేదని సిఎం పేర్కొన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ… గతంలోని ఏ పాలకుడు మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదని చెప్పారు. 15 రోజులు జిల్లాలో తిరిగి ఫ్లోరైడ్ కష్టాలను అవగాహన కల్పించామన్నారు. . అందరి పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని సిఎం తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ జలాల ద్వారా జోరో ఫ్లోరైడ్ జల్లాగా మారిందన్నారు. నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్ గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారని కెసిఆర్ వెల్లడించారు. మేధావులు హెచ్చరించినా.. ఫ్లోరైడ్ గురించి గత పాలకులు ఆలోచించలేదన్నారు. నల్గొం జిల్లాలో కృష్ణానది పారుతున్నా… ప్రజలకు తాగునీళ్లు అందలేదని సిఎం కెసిఆర్ ఆరోపించారు.