Friday, December 20, 2024

మార్పుకు ‘మహా’ నాంది

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో రైతాంగం బాగుపడే వరకు బిఆర్‌ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్రలోని నా ందేడ్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ బి ఆర్‌ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన బిఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించి, మహనీయుల చిత్రపటాల కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దా టినా దేశంలో సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నదేశాలైన సింగపూర్, మ లేషియా గొప్పగా అభివృద్ధి చెందాయని అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉందని సిఎం కెసిఆర్ చెప్పారు.

రెం డు రాష్ట్రాలు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయని అన్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక సమస్యలను పరిస్కరించుకున్నామని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎం దుకని కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తున్నామని, మ హారాష్ట్రలో పలుచోట్ల వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వచ్చే దుస్థితి ఉందని సిఎం గుర్తుచేశా రు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తున్నదని, రైతుబంధు సా యం రైతుల ఖాతాల్లో జమవుతుందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదు
దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారు. బిజెపి పాలనలో తాగునీటికి, సాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదర్కొంటున్నామని అన్నారు. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. దేశంలో రైతులు ఎప్పుడూ పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకని నిలదీశారు. దేశమంతటా ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతోనే బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. దేశ రైతాంగం బాగుపడే వరకు బిఆర్‌ఎస్ పోరాటం ఆగదని చెప్పారు. దేశంలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నా వాడుకోలేక వృథా చేస్తున్నామని సిఎం తెలిపారు.

దేశంలో ఏటా 1.40 లక్షల టిఎంసిల వర్షం పడుతుంటే మనం కేవలం 20 వేల టిఎంసిల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నామని అన్నారు.50వేల టిఎంసీల నీరు సముద్రం పాలు చేసుకుంటున్నాము. ఇది తాను కానీ, బిఆర్‌ఎస్ పార్టీ కాని చెప్పటం లేదని, మన కేంద్ర సిడబ్ల్యూసి చెప్పిన విషయమని పేర్కొన్నారు. ఇదీ దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన వారి పనితీరు అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. రైతులు ఎ ల్లకాలం పోరాటాలు చేస్తూ బలికావాల్సిందేనా సి ఎం ప్రశ్నించారు. పెద్ద దేశంలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టకూడదని ప్రశ్నించారు.

తెలంగాణ మోడల్ కావాలంటున్నారు
ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా తెలంగాణ మోడ ల్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, విద్వేష రాజకీయాలు చేసిన బిజెపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని చెప్పారు. కర్ణాటక ఫ లితాల తర్వాత కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని, వారి కలలు కల్లలే అవుతాయని అన్నారు.

కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉండాలి
కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు మాత్ర మే బిఆర్‌ఎస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పార్టీలో చేరేవాళ్ల కు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడే తెగువ ఉం డాలని, నిత్యం ప్రజలతో మమేకమై వారిని చైతన్యపర్చాలని సూచించారు. బిఆర్‌ఎస్ శిక్షణ శిబిరం ద్వారా పలువురు ఇతర పార్టీల ముఖ్యనేతలు, ప్ర జాప్రతినిధులు బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..ఒకసారి అడుగు ము ందుకు వేస్తే వెనుకడుగు వేసేది లేదని చెప్పారు. మన లక్ష్యం గొప్పదని, త్వరలోనే పార్టీ కమిటీలు నియమించుకుందామని అన్నారు. మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బిఆర్‌ఎస్ కమిటీలు వుండాలని, జెండాలు ఎగరాలని చెప్పారు. శివాజీ మహారాజ్‌ది ఈ ప్రదేశం, డా.బిఆర్ అంబేడ్కర్ ఇక్కడి వారే… ఇంకా ఎందరో మహానుభావులు పుట్టిన గ డ్డ ఇది అని పేర్కొన్నారు. ఇది బుద్దిజీవుల దేశం అని వ్యాఖ్యానించారు.

పాటలు విన్నారు కదా… మంచిగా వున్నాయి కదా అని అడిగారు. ఇంకా వే ల పాటలు తయారు చేద్దాం.. ఇంకా చాలా కేసెట్లు తీద్ధామని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ జమానా నడుస్తున్నదని, మొదటగా మీ ఫోన్లలో వేసుకోండి… తరువాత మీ ఊర్లల్లోని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండని పిలునిచ్చారు. మహరాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి దేశ్ ముఖ్ వుంటారని, పదాది కారులు నియమించుకోవాని చెప్పారు. అదేవిధంగా శిబిరంలో జరిగే శిక్షణ తరగతుల సమాచారాన్ని డిజిటల్ రూపంలో అందిస్తామని, అందరూ వాటిని సమగ్రంగా తెలుసుకోవాలని సిఎం కెసిఆర్ కోరారు.

తెలంగాణ వెలుపల తొలిసారిగా శిక్షణ తరగతులు
తెలంగాణ వెలుపల బిఆర్‌ఎస్ తొలిసారిగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ తొలిసారిగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నది. రెం డురోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శు క్రవారం సిఎం కెసిఆర్ ప్రారంభించారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటనకై శుక్రవారం ప్రగతి భవన్ నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో నాందేడ్ బయలుదేరి వెళ్లారు. నాందేడ్ పట్టణానికి చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుండి శిక్షణా శిభిరం ఏర్పాటు చేసిన అనంత్ లాన్స్‌కు వేదిక వద్దకు చేరుకుని, బిఆర్‌ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరం ఆయన బిఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అక్కడ శిక్షణ శిబిరంలో ప్రసంగించిన అనంతరం నాందేడ్ పర్యటన ముగించుకొని సాయంత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

గులాబీ మయమైన అనంత్‌లాన్స్ వేదిక
బిఆర్‌ఎస్ పార్టీ శిక్షణ శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్ వేదిక మొత్తం గులాబీ మయమైంది. నాం దేడ్ వ్యాప్తంగా కెసిఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లక్సీలు వెలిశా యి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, దేశ్ కీ నేత కేసీఆర్ వంటి నినాదాలతో వెలిసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షించాయి. నాందేడ్ విమానాశ్రయం నుంచి అనంత్‌లాన్స్ మార్గంతోపాటు రైల్వేస్టేషన్ సహా ప్ర ధాన కూడళ్లలో గులాబీ ఫ్లక్సీలు సందడి చేస్తున్నా యి. కాగా, మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు.

ప్రచార సామగ్రి, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్
రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి.. కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లను పార్టీ బాధ్యులకు అందజేశారు. వాటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేశారు. మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంసృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News