Saturday, December 21, 2024

సంగారెడ్డి జిల్లాపై సిఎం కెసిఆర్ వరాల జల్లు..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లాపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్‌ చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కావాలని ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి అడిగారు.. ఇవాళనే మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తామని సిఎం వెల్లడించారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి కాలనీలు వస్తున్నయని చెప్పారు. కొల్లూరులో 17 వేలపైచీలుకు డబుల్ రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశామని, పటాన్‌ చెరువుకు 2 వేల ఇండ్లు కేటాయిస్తున్నామని అన్నారు.

రామసముద్రం చెరువు సుందరీకరించి గొప్పగా చేయాలని మహిపాల్‌ రెడ్డి కోరుతున్నారని, ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని హరీర్‌ రావుకు చెప్పారు. సిద్దిపేట కోమటిచెరువు తరహాలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కాలనీలు వచ్చిన వెంటనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాదని, అదనంగా సహాయం కావాలని ఎంఎల్‌ఎ కోరుతున్నారని, జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లు ఇస్తామని సిఎం ప్రకటించారు. 55 గ్రామ పంచాయతీల ప్రత్యేక అభివృద్ధి కోసం సిఎం ఫండ్ నుంచి ఒక్కో పంచాయతీకి రూ.15 లక్షల చొప్పుల మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News