Wednesday, January 22, 2025

మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలిః సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సోలాపూర్‌ః దేశంలో అభివృద్ధి జరగాలంటే మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రెండు రోజుల మహారాష్ట్ర పర్యటలో భాగంగా సోమవారం సోలాపూర్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్ ముంగళవారం సర్కోలిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ.. ”భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచిపోయాయి. 75ఏళ్ల తర్వాత భారత్ అభివృద్ధి ఎలా ఉందో ఆలోచించాలి. ప్రజలు కాంగ్రెస్, శివసేన, బిజెపికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ దాదాపు 50ఏళ్లు దేశాన్ని పాలించింది. భారత్ సరికొత్త పంథాలో నడవాల్సి ఉంది.

ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధి సాధించింది. తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు?. అన్ని వనరులు ఉన్న మహారాష్ట్ర ఇంకెంత అభివృద్ధి జరగాలి. చిన్న పార్టీ విషయంలో అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. బిజెపికి బిఆర్‌ఎస్ ఏ టీమ్‌గా విమర్శిస్తున్నారు. ఎవరెన్ని విమర్శించిన బిఆర్‌ఎస్ విస్తరణ జరుగుతుంది. బిఆర్‌ఎస్ అంటే భారత్ పరివర్తన పార్టీ. బిఆర్‌ఎస్ రైతుల పక్షాన మాత్రమే నిలుస్తుంది. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నాం.దేశంలో 70వేల టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. ప్రభుత్వంలో సత్తా ఉంటే ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. పాత విధానాలను బంగాళాఖాతంలో కలపాలి అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News