Friday, November 15, 2024

సెర్ప్, ఐకెపి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు

- Advertisement -
- Advertisement -
CM KCR Speech in Telangana Assembly
సెర్ప్, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు, అసెంబ్లీ లో ప్రకటించిన సీఎం కెసిఆర్ గారి కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆనందోత్సాహాలలో సెర్ప్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు

హైదరాబాద్: తాను పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు వరాలు కురిపించిన సీఎం కెసిఆర్ గారికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. 2022-23 ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ లో మంగళవారం ప్రసంగించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేదరిక నిర్మూలనలో, డ్వాక్రా మహిళల సంఘాల కు నిధులు అందించి, విశేష సేవలు చేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు అందిస్తామని ప్రకటించారు.

అలాగే ఇందులో భాగంగా పని చేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు ఇస్తామని సీఎం తెలిపారు. మరోవైపు గత కొంత కాలంగా ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామన్నారు. అయితే భేషజాలకు పోయి ఆందోళనలు, ధర్నాలు చేయవద్దని, అలా చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. దీంతో 7,305 ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి వారి ఉపాధి వారికి లభించినట్లు అయింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అభినందించారు. తన శాఖ పరిధిలోని ఉద్యోగుల కోసం పదేపదే గుర్తు చేశారని చెప్పారు. కాగా, సెర్ప్, ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం గారికి, మంత్రి ఎర్రబెల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News